అనుష్కను ఆవహించిన భాగమతి ఈవిడే

ఈ ఏడాది మొదటి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘భాగమతి’ సినిమా చూసి ఎంజాయ్ చేసినవాళ్లు కొందరైతే.. ఆ సినిమా చూసి ‘అనుష్క ఏంటీ ఒక్కో ఫ్రేమ్/సీన్ లో ఒక్కోలా కనిపిస్తుంది?’ అంటే ఒకసారి సన్నగా, ఒకసారి బొద్దుగా కనిపించేసరికి కంటిన్యూటీ లేదేమోనని అనుకొన్నారు. కానీ.. అనుష్క అలా పలు విధాలుగా కనిపించడానికి కారణం ఉందండోయ్. సాధారణంగా సినిమాల్లో హీరోలకు బాడీ డబుల్/డూప్ ఉండడం చూసి ఉంటాం. “బాహుబలి” సినిమాలో ప్రభాస్ కి బాడీ డబుల్ గా వ్యవహరించిన కిరణ్ రాజ్ ఇప్పుడు ఎంత పాపులర్ అయ్యాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడతను ఏకంగా హీరో కూడా అయిపోయాడు.

ఇప్పుడు అనుష్కకు కూడా అదే తరహాలో త్రివేణి అనే యువ కథానాయిక బాడీ డబుల్ గా నటించింది. “భాగమతి” చిత్రంలో మనకి కనిపించే పెయింటింగ్స్ లో కనిపించేది ఈమే. అలాగే.. “భాగమతి”లో అనుష్క రన్నింగ్ సీన్స్ మరియు ఆమె మొహం కనిపించకుండా తీసిన సన్నివేశాల్లో అనుష్కకు బాడీ డబుల్ గా నటించింది కూడా త్రివేణి. అలాగని ఆమె ఏదో సైడ్ ఆర్టిస్ట్ అనుకొంటే పొరపాటే. అమ్మడు ఆల్రెడీ కొన్ని సినిమాల్లో కథానాయికగా నటించింది. ప్రస్తుతం “తమిళ తంబి” అనే చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా కీలకపాత్ర పోషిస్తోంది. “బాహుబలి”లోనూ ఓ ముఖ్యపాత్ర పోషించిందట త్రివేణి. ఆమెను అక్కడ చూసిన “భాగమతి” యూనిట్ అనుష్క బాడీ డబుల్ గా సరిగ్గా సరిపోతుందని ఈమెను సెలక్ట్ చేశారు. ప్రస్తుతం త్రివేణికి తెలుగుతోపాటు తమిళ సినిమా ఆఫర్లు కూడా క్యూకడుతున్నాయట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus