టాలీవుడ్ లో పెద్ద విషాదం చోటుచేసుకుంది. టాప్ కమెడియన్ వేణుమాధవ్ ఈరోజు కన్ను మూశారు. నిన్నటి నుండీ వేణుమాధవ్ చనిపోయాడు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ… ఈరోజు మధ్యాహ్నం వేణు మాధవ్ కుటుంబసభ్యులు వేణు మాధవ్ చనిపోయినట్టు ప్రకటించారు. 1979 లో సూర్యాపేట… కోదాడ లో జన్మించిన వేణు మాధవ్ తన 4 వ ఏట నుండే మిమిక్రీ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తరువాత ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ‘సాంప్రదాయం’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసాడు. ఇక తరువాత నటించిన ‘తొలి ప్రేమ’ సినిమాలో కూడా వేణుమాధవ్ కామెడీ క్లిక్ అవ్వడంతో అక్కడి నుండీ వెనక్కి తిరిగి చూసుకోలేదు వేణుమాధవ్.
ఓ దశలో బ్రహ్మానందం, వేణుమాధవ్, అలీ వంటి స్టార్ కమెడియన్లను కూడా డామినేట్ చేసే రేంజ్ లో వేణుమాధవ్ దూసుకుపోయాడు. కానీ తరువాత ఆరోగ్యం దెబ్బ తినడంతో సినిమాలు తగ్గించేసాడు. గత నాలుగు సంవత్సరాలుగా… కాలేయం సమస్యతో బాదపడుతున్న వేణుమాధవ్ కు ఆ తరువాత కిడ్నీలు కూడా దెబ్బతిన్నాయట. ఇలా వేణు మాధవ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఇక నిన్న పరిస్ధితి మరింతగా విషమించడంతో సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రి లో జాయిన్ చేసారు. అలా చికిత్స పొందుతూనే వేణుమాధవ్ మరణించినట్టు తెలుస్తుంది.