పూజా హెగ్డేకి (Pooja Hegde) తెలుగులో ఆఫర్లు రావడం లేదు. 2022 లో వచ్చిన ‘ఎఫ్ 3’ (F3 Movie) లో ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత ఆమె ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని (Ustaad Bhagat Singh) ఆమె రిజెక్ట్ చేసింది. మరోపక్క ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా నుండి ఆమె ఎపిసోడ్ ను డిలీట్ చేశారు. దీంతో తెలుగు ఫిలిం మేకర్స్ పై పూజా కోపంగా ఉన్నట్లు ఉంది.
అందుకే ఓ బ్లాక్ బస్టర్ తెలుగు సినిమాని తమిళ సినిమా అంటూ చెప్పి విమర్శల పాలవుతుంది. వివరాల్లోకి వెళితే.. గతవారం బాలీవుడ్లో రిలీజ్ అయిన ‘దేవా’ (Deva) మూవీ ప్రమోషన్స్ లో పూజా హెగ్డే పాల్గొంది. ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ నోరు జారింది. దీంతో ఆమెపై ట్రోల్స్ మొదలయ్యాయి. పూజా హెగ్డే మాట్లాడుతూ.. “పాన్ ఇండియా కంటెంట్ కు ఉన్న ప్రాముఖ్యత వేరు. వాస్తవానికి ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramulo0) అనే ఓ తమిళ సినిమాని హిందీ ప్రేక్షకులు కూడా ఆదరించారు.
డిజె- దువ్వాడ జగన్నాథం’ (Duvvada Jagannadham) ని కూడా హిందీ ప్రేక్షకులు ఎగబడి చూశారు. కాబట్టి కంటెంట్ బాగుంటే ప్రేక్షకులకి భాషతో సంబంధం లేదు. అందరికీ రీచ్ అవుతుంది” అంటూ చెప్పుకొచ్చింది. పూజా హెగ్డే ఇంటెన్షన్లో ఎటువంటి పొరపాటు లేదు. కానీ ‘అల వైకుంఠపురములో’ అనే ప్రాపర్ తెలుగు మూవీ. రీజనల్ మూవీస్ కేటగిరిలో అది ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది.
వాస్తవానికి ఆ సినిమాతోనే పూజా హెగ్డే రేంజ్ పెరిగింది. పారితోషికం కూడా పెరిగింది. తమిళ, హిందీలో కూడా ఆమె డిమాండ్ పెరగడానికి ఆ సినిమా కారణమని చెప్పొచ్చు. తనకు అంత కీర్తి తెచ్చిపెట్టిన తెలుగు సినిమాని.. తమిళ సినిమా అంటూ ప్రస్తావించడంపై తెలుగు ఆడియన్స్ హర్ట్ అవుతున్నారు. అందుకే పూజా హెగ్డేని విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు.