ఎప్పుడూ చాలా కూల్ గా ఉండే డైరక్టర్ కొరటాల శివ జనతా గ్యారేజ్ సినిమా తర్వాత తనలో దాగిన బాధను బయట పెట్టారు. తనకి రచయితగా క్రెడిట్ ఇవ్వకపోవడంతోనే డైరక్టర్ గా మారానని చెప్పారు. సింహ ను తాను కథ డైలాగులు అందించినా ఆ సినిమా డైరక్టర్ బోయపాటి శ్రీను టైటిల్ లో తన పేరు వెయ్యలేదని అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బోయపాటి ఇటువంటి వ్యక్తా? అని పరిశ్రమలో అందరూ చర్చించుకోసాగారు. ఈ విషయం పై బోయపాటి స్పందించలేదు.
కానీ ఆ డైరెక్టర్ సన్నిహితులు చెబుతున్న వెర్షన్ వేరేగా ఉంది. సింహ సినిమా మూల కథ బోయపాటి రాసారని, దాని స్క్రిప్ట్ పనుల్లో కొరటాల శివతో పాటు మరో నలుగురు రచయితలు పాల్గొన్నారంట. చివరికి టైటిల్స్ లో డైలాగ్స్ ఎవరి పేరు వెయ్యాలని అనుకుంటుండగా, ఆ పూర్తి క్రెడిట్ తనకే ఇవ్వాలని కొరటాల పట్టుబడడంతో, అతనికి ఇస్తే ఇతర రచయితలు భాధ పడతారని కథ, మాటలు బోయపాటి పేరునే వేసుకున్నారని తెలిసింది. అంతేకాదు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో పాల్గొన్నందుకు 7 లక్షలు ఇవ్వాల్సి ఉండగా, కొరటాలకు 6 లక్షలు మాత్రమే ఇచ్చారంట. అప్పటి విషయాలను మనసులో పెట్టుకుని శివ ఇలా మాట్లాడారని బోయపాటి సన్నిహితులు వెల్లడించారు.