Thammudu: నితిన్ కి మాత్రమే కాదు దిల్ రాజుకి కూడా పెద్ద పరీక్షే..!

నితిన్ (Nithiin) సినిమాతోనే దిల్ రాజు (Dil Raju)  నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘దిల్’ పెద్ద సక్సెస్ అందుకుంది. ఆ సినిమా టైటిల్ నే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నారు దిల్ రాజు. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో ‘శ్రీనివాస కళ్యాణం’ అనే సినిమా వచ్చింది. అది పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ‘తమ్ముడు’ (Thammudu) రాబోతుంది. ఈ సినిమా సక్సెస్ అటు నితిన్ కి.. ఇటు దిల్ రాజుకి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇద్దరూ కూడా వరుస ప్లాపులు చవి చూశారు.

Thammudu

నితిన్ అయితే ‘చెక్’ (Check) ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam)  ‘ఎక్స్ట్రా’ (Extra Ordinary Man)  ‘రాబిన్ హుడ్’ (Robinhood) వంటి వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్నాడు. ఇక దిల్ రాజుకి కూడా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) వంటి చాలా ప్లాపులు పడినా.. ‘గేమ్ ఛేంజర్’ (Game changer) ఇచ్చిన షాక్ వేరు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) పెద్ద బ్లాక్ బస్టర్ అయినా అది పూర్తిగా దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi), సంక్రాంతి సీజన్..ల క్రెడిట్ అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. సో దిల్ రాజుకి కూడా ఓ మంచి హిట్ కావాలి. అందుకే వీరికి ‘తమ్ముడు’ సక్సెస్ అనేది కీలకంగా మారింది.

వాస్తవానికి ‘తమ్ముడు’ (Thammudu) సినిమా ఫిబ్రవరి 18న శివరాత్రి కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఆ తర్వాత మే 9కి వాయిదా వేసినట్టు అంతా చెప్పుకున్నారు. కానీ ఆ డేట్ ని ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) టీం లాక్ చేసుకోవడంతో అది కూడా ఫిక్స్ అవ్వలేదు. ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’ కూడా పోస్ట్ పోన్ అవుతుంది అంటున్నారు.

అప్పుడు మే 9 ఖాళీగా ఉంటుంది. కానీ ‘తమ్ముడు’ టీం ఆ డేట్ కోసం ఏమీ ట్రై చేయడం లేదు. దీని వెనుక ఓ బలమైన కారణం కూడా ఉంది. అదేంటంటే.. ‘తమ్ముడు’ రషెస్ చూసుకున్న తర్వాత దిల్ రాజు కొన్ని మార్పులు కావాలని సూచించారట. దీంతో ఇప్పుడు రీ- షూట్లు చేస్తున్నారట. అందువల్ల మరింత సమయం పడుతుందట. దీంతో జూలై 4కి ‘తమ్ముడు’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు టాక్.

సూర్య సినిమాలో హీరోయిన్స్.. జ్యోతిక చెబితేనే…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus