Rajamouli: బ్రహ్మాస్త్ర లాభాల్లో వాటా తీసుకోనున్న జక్కన్న?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులముందుకు తీసుకు వస్తున్న డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన దర్శకత్వంలో వచ్చిన బాహుబలి త్రిబుల్ ఆర్ వంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించారు. ఈ విధంగా దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన బ్రహ్మాస్త్ర సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నట్టు తెలుస్తుంది.

బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ అలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ విడుదల కానుంది. ఇక ఈ సినిమాను తెలుగులో రాజమౌళి సమర్పణలో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.ఇలా బ్రహ్మాస్త్ర సినిమా కోసం జక్కన్న ఇంతలా కష్టపడటం వెనుక ఒక కారణం ఉందని తెలుస్తోంది. ఏపీలో బ్రహ్మాస్త్ర డిస్ట్రిబ్యూషన్ హక్కులను రాజమౌళి దక్కించుకున్నట్లు సమాచారం.

తన మిత్రుడు బళ్లారి సాయితో కలిసి రాజమౌళి ఈ సినిమాని ఆంధ్రాలో విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నటువంటి రాజమౌళి ఈ సినిమాకి వచ్చే లాభాల్లో కూడా వాటా తీసుకోనున్నారని సమాచారం. ఇలా ఈ సినిమా వాటాలో లాభాలు తీసుకోనున్న నేపథ్యంలోనే ఈ సినిమా కోసం తనదైన శైలిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ పెద్ద ఎత్తున ఈ సినిమాని ప్రేక్షకులకు దగ్గర చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాల్గొనడం వెనుక కూడా రాజమౌళి హస్తము ఉందని తెలుస్తోంది.ఇక బ్రహ్మాస్ర చిత్ర బృందంతో కలిసి జక్కన్న పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు మరి ఈ సినిమా రాజమౌళికి ఎలా కలిసి వస్తుందో తెలియాల్సి ఉంది.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus