Animal Movie: యానిమల్’ షూటింగ్ ఆలియా చాలా సపోర్టు చేసింది: రణ్ బీర్

అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో వస్తున్నమరో చిత్రం యానిమల్ ఈ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది. సెంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో హీరోగా రణబీర్, హీరోయిన్ గా రష్మిక మందాన్న నటించారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. హీరో రణబీర్ కపూర్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాపై అంచనాలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

అయితే తన భార్య హీరోయిన్ ఆలియా భట్ మీద ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. ‘యానిమల్’ ఈ సినిమా షూటింగ్ సమయంలో తన భార్య ఆలియా నుంచి చాలా సపోర్టు లభించిందని రణబీర్ కపూర్ తెలిపారు. కొన్ని సన్నివేశాల విషయంలో నటుడిగా తనకు చాలా భయం కలిగిందని చెప్పారు. ఆ భయాన్ని దూరం చేయడంలో ఆలియా సాయపడిందన్నారు. “ఆలియా, నేను మా సినిమాల గురించి నిత్యం మాట్లాడుకుంటాం. నటిగా ఆమెను ఎంతో గౌరవిస్తాను.

ఆమె సినిమాల గురించి ఆలోచించే విధానం కూడా చాలా మెచూర్డ్ గా ఉంటుంది. సినిమా షూటింగ్ కు వెళ్లే సమయంలో ఆమె చర్చిస్తాను. ఆయా సన్నివేశాల్లో ఎలా నటించాలో తను కీలక సూచలను అందిస్తుంది. ఒక నటుడిగా నేను భయపడిన సన్నివేశాల్లోనూ ఆమె అందించిన సపోర్టును మర్చిపోలేను.

‘యానిమల్’ (Animal Movie) లాంటి ఇంటెన్స్ సినిమా నేను గతంలో ఎప్పుడూ చేయలేదు. నేను ఎప్పుడూ స్క్రీన్ మీద మంచి తనాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించాను. కానీ, ఇప్పుడు పూర్తి విరుద్ధమైన క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్ చేసేందుకు ఆలియా అన్ని విధాలుగా నన్ను ప్రోత్సహించింది. ఈ సినిమా విషయంలో ఆమె బలమైన మద్దతునిచ్చింది” అని వెల్లడించారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus