ఈ మధ్యకాలంలో కొరియన్ సినిమాలను టాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన ‘ఓ బేబీ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన ప్రోత్సాహంతో మరో కొరియన్ సినిమాను రీమేక్ చేశారు. అదే ‘శాకిని డాకిని’. ఇందులో నివేదా థామస్, రెజీనా హీరోయిన్లుగా నటించారు. ‘మిడ్ నైట్ రన్నర్స్’ అనే కొరియన్ సినిమాకి ఇది రీమేక్. ఒరిజినల్ సినిమా మేల్ వెర్షన్ లో ఉంటుంది.
కొరియన్ లో ఇద్దరు హీరోలు నటించిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయింది. సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అది మేల్ వెర్షన్ కావడమే. కొత్తగా ఉద్యోగంలో చేరిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఓ కిడ్నాపింగ్ కేసుని సాల్వ్ చేయడమే కథలో మెయిన్ ప్లాట్. అయితే తెలుగు వెర్షన్ కి వచ్చేసరికి నిర్మాత సునీత తాటి చాలా మార్పులు చేశారు. ఇద్దరు హీరోలకు బదులు ఇద్దరు హీరోయిన్లను పెట్టి సినిమా తీశారు. హీరోయిన్లకు తగ్గట్లుగా కొన్ని మార్పులు చేసి సుధీర్ వర్మ చేతిలో పెట్టారు.
విడుదలకు ముందు సినిమాపై మంచి బజ్ వచ్చింది. కానీ రిలీజ్ తరువాత ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. రెజీనా, నివేదా అద్భుతంగా నటించారు. వారికి పేరు పెట్టడానికి లేదు కానీ స్క్రిప్ట్ విషయంలోనే తప్పు జరిగిందని చర్చించుకుంటున్నారు. ఫీమేల్ వెర్షన్ గా మార్చకుండా.. ఉన్నది ఉన్నట్లుగా తీసి ఉంటే సినిమా కచ్చితంగా బాగుండేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ కి చెందిన ఇద్దరు యంగ్ హీరోలను పెట్టి సినిమా తీసి ఉంటే మంచి ఓపెనింగ్స్ వచ్చి ఉండేవని అంటున్నారు.
నిజానికి తెలుగులో లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమాలకు రీచ్ తక్కువ. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ నటించినా.. హీరోలతో సమానంగా వసూళ్లు రావడం మాత్రం అరుదుగా జరుగుతుంటుంది. కథ క్లిక్ అయితే మాత్రం ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడతారు. ‘శాకిని డాకిని’ విషయంలో నిర్మాతలు ఈ కోణంలో ఆలోచించాల్సింది!