విజయ్ దేవరకొండ, రష్మిక మందన.. జంటగా నటించిన ‘గీత గోవిందం’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్ లేదు. పరశురామ్ (బుజ్జి ) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘జిఏ2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మించాడు. 15 కోట్లకు ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చెయ్యగా 69 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే 130 కోట్ల వరకూ కలెక్ట్ చేసింది. అంటే పెట్టిన దానికి 4 రెట్లు పైనే లాభాలను అందించింది.
అంత హిట్ అయిన ఈ చిత్రం కథను దర్శకుడు పరశురామ్ ముందుగా అల్లు అర్జున్ కే వినిపించాడట. కానీ అల్లు అర్జున్ రిజెక్ట్ చేసాడు. ఇంత సూపర్ హిట్ కథను బన్నీ ఎందుకు రిజెక్ట్ చేసాడు అనే చర్చ ఇప్పటికీ సాగుతూనే ఉంది. అయితే దానికి సమాధానం తాజాగా లభించింది. దర్శకుడు పరశురామ్… అల్లు శిరీష్ తో ‘శ్రీరస్తూ శుభమస్తు’ అనే చిత్రం చేసిన మూడు నెలల వ్యవధిలోనే ‘గీత గోవిందం’ కథ అల్లు అర్జున్ కు వినిపించాడట.
అయితే అప్పటికే ‘సరైనోడు’ వంటి మాస్ హిట్ కొట్టిన బన్నీకి ఇంత క్లాస్ లవ్ స్టోరీ చేస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అనే అనుమానం వ్యక్తం చేసాడట. కథ బాగుంది.. కచ్చితంగా హిట్ అవుతుంది.. అయితే ఓ కొత్త హీరో చేస్తేనే బాగుంటుంది అని దర్శకుడు పరశురామ్ కు బన్నీ చెప్పాడట. దాదాపు సంవత్సరం వరకూ ఈ కథని హోల్డ్ లో పెట్టాల్సి వచ్చిందట. తరువాత సంవత్సరం ‘అర్జున్ రెడ్డి’ సూపర్ హిట్ అవ్వడంతో విజయ్ దేవరకొండ తో ఈ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టారని తెలుస్తుంది.
Most Recommended Video
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!