తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో భారీ స్టార్ డమ్ సొంతం చేసుకున్న నటి సాయి పల్లవి (Sai Pallavi). తిప్పికొడితే 15 సినిమాలు చేసిన సాయిపల్లవి సాధించిన క్రేజ్ చూసి మిగతా హీరోయిన్లు ఈర్ష్యపడుతుంటారు. అటువంటి సాయిపల్లవిని బాయ్ కాట్ చేయాలని నిన్నటినుండి సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ చూసి నవ్వుకోవడం తప్ప ఏమీ చేయలేం. అసలు ఎందుకు ఇలా బాయ్ కాప్ సాయిపల్లవి అని ట్రెండ్ చేస్తున్నారా అని పరిశీలిస్తే..
BoycottSaiPallavi
గతంలో “విరాటపర్వం” (Virata Parvam) సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా సాయిపల్లవి (SaiPallavi) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మన భారతీయ సైనికులను పాకిస్థాన్ ఆర్మీ టెర్రరిస్టులు అనుకుంటుంది” అని కామెంట్ చేసింది. ఆమె చెప్పిన పూర్తి విషయాన్ని గాలికి వదిలేసి కేవలం ఆ ఒక్క మాటను పట్టుకొని “బాయ్ కాట్ సాయిపల్లవి” అని ట్రెండ్ మొదలుపెట్టారు జనాలు.
అంతేకాక.. రామాయణంలో ఆమెను సీతలా ఎందుకు తీసుకున్నారు అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ ట్రెండ్ చేసేవాళ్ళకి మతిలేదు అని ఊరుకుందాం అనుకుంటే.. ఈ ట్రెండ్ అనేది కేవలం సౌత్ లో కాదు ఏకంగా ఇండియా వైడ్ ట్రెండ్ అవుతోంది. అంటే అంతమంది పనిలేని వాళ్ళు ఉన్నారా అని ఆశ్చర్యపోవడం తప్ప ఏమీ చేయలేం. ఇకపోతే.. సాయిపల్లవి “అమరన్” (Amaran) అనంతరం “తండేల్” (Thandel) సినిమాలో బుజ్జి తల్లిగా ప్రేక్షకుల్ని పలకరించనుంది.
అయినా మణిరత్నం (Mani Ratnam) లాంటి సీనియర్ ఫిలిం మేకర్ పబ్లిక్ స్టేజ్ మీద “నేను సాయి పల్లవి (SaiPallavi) ఫ్యాన్, ఎప్పటికైనా ఎంతో వర్క్ చేయాలని ఉంది” అని చెప్పిన తర్వాత ఇలాంటి పనికిమాలిన బాయ్ కాట్ హ్యాష్ ట్యాగ్స్ ఆమె ఇమేజ్ కు డ్యామేజ్ చేసేదేమీ లేదు. మరీ ముఖ్యంగా తెలుగులో ఆమెను లేడీ పవర్ స్టార్ అంటారు. మాస్ జనాల మనసుల్లోకి ఆస్థాయిలో చొచ్చుకుపోయిన సాయిపల్లవికి (SaiPallavi) ఈ బాయ్ కాట్ బ్యాచ్ ఏం చేయగలదు చెప్పండి.