మహేష్ బాబు హీరోగా తేజ డైరెక్షన్లో తెరకెక్కిన ‘నిజం’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పటి వరకూ డైరెక్టర్ తేజ తీసిన అన్ని సినిమాలు సూపర్ హిట్లే..! ‘చిత్రం’ నువ్వు నేను’ ‘జయం’ .. ఇలా అన్ని మంచి విజయాల్ని నమోదు చేశాయి. ఇక మహేష్ బాబు కూడా ‘ఒక్కడు’ చిత్రంతో స్టార్ గా ఎదిగాడు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే.. అంచనాలు ఓ రేంజ్లో పెరగడం ఖాయం. కానీ ‘నిజం’ చిత్రం ప్లాప్ అయ్యింది. అప్పటికే మహేష్ ను మాస్ యాంగిల్ లో చూసేసిన ప్రేక్షకులు.. ఈ చిత్రంలో అంత అమాయకంగా కనబడే మహేష్ ను యాక్సెప్ట్ చేయలేకపోయారు.
సినిమా ప్రాఫిటబులే అయినప్పటికీ.. అప్పటి లెక్కల ప్రకారం ఫ్లాపే.! ఇది పక్కన పెట్టేస్తే.. ఈ చిత్రం కోసం సీనియర్ యాక్టర్స్ నే తీసుకున్నాడు డైరెక్టర్ తేజ. అయితే ఎంతో అనుభవజ్ఞుడైన నటుడు మురళీ మోహన్ ను ఈ చిత్రం నుండీ తీసేశాడట. అప్పట్లో ఈ వార్త పెద్ద దుమారాన్నే రేపింది. మురళీ మోహన్ ఎంతో గొప్ప నటుడు.’అంతటి గొప్ప నటుడుని ..’నిజం’ సినిమా నుండీ కేవలం 3 చిత్రాల అనుభవం ఉన్న దర్శకుడు తేజ ఎందుకు తీసేసినట్టు?’ అనే డౌట్ అందరిలోనూ ఉంది.
దానికి డైరెక్టర్ తేజనే ఇటీవల సమాధానం ఇచ్చాడు. ” మురళీ మోహన్ గారితో 70శాతం షూటింగ్ చేసాం. తరువాత రషెస్ చూస్తే.. ఆయన ఆ పాత్రకు ఫిట్ అయినట్టు అనిపించలేదు. దాంతో ప్రకాష్ రాజ్ గారిని ఆ పాత్రకు తీసుకున్నాం. పోలీస్ కు కావాల్సిన హావా భావాలకు మురళీ మోహన్ గారు సెట్ అవ్వలేదేమో అనిపించి.. ఆయన పాత్రను తొలగించాం. ఆయన ఫీలయ్యి ఉంటారేమో అని కూడా అప్పుడు ఆలోచించలేదు.ఆయనతో నాకు గొడవలు కూడా ఏమీ అవ్వలేదు” అంటూ తేజ చెప్పుకొచ్చాడు.