Bigg Boss 5 Telugu: అందుకే బిగ్ బాస్ హౌస్ నుంచీ విశ్వ బయటకి వచ్చేశాడా?

బిగ్ బాస్ హౌస్ లో శనివారం నాగార్జున ఎపిసోడ్ మజా ఇచ్చింది. వచ్చీ రావడంతోనే అనీమాస్టర్ కెప్టెన్ అయినందుకు బాగా మెచ్చుకున్నాడు. గివ్ అప్ ఇవ్వకుండా ఆడితే ఇలా ఉంటుంది రిజల్ట్ అంటూ చెప్పాడు. అంతేకాదు, సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్ లో ఎవరైతే టార్చర్ పెట్టి జ్యూస్ లు తాగించారో వారికి పే బ్యాక్ ఇచ్చే టైమ్ వచ్చిందని వారితో జ్యూస్ లు తాగించాడు. రవి షణ్ముక్ ని సెలక్ట్ చేస్కుంటే, శ్రీరామ్ సన్నీతో, అనీమాస్టర్ కాజల్ తో సోయా ఇంకా ఎగ్ మిక్స్ డ్ డ్రింక్స్ తాగించి రివేంజ్ తీర్చుకుంది. దీనికి నాగిని జ్యూస్ అని పేరు కూడా పెట్టింది. ఇక శనివారం ఇంట్లో హీరో ఎవరు ? విలన్ ఎవరు ? అనే గేమ్ ఆడించాడు నాగార్జున.

ఇక్కడే విశ్వకి ఏకంగా ముగ్గురూ హీరోగా స్టార్ ని ఇచ్చారు. ఇందులో శ్రీరామ్ చంద్ర సాలిడ్ రీజన్ చెప్తూ స్టార్ ఇచ్చాడు. ఆ తర్వాత రవి, ఇంకా అనీమాస్టర్ కూడా విశ్వకి స్టార్ ఇచ్చి హీరోని చేశారు. ఇక మూడు ఓట్లతో పింకీ విలన్ గా మారింది. సిరి, విశ్వ, సన్నీ ముగ్గురూ పింకీని విలన్ గా ఎంచుకున్నారు. ఇక హౌస్ లో హీరోగా ఉన్న విశ్వ సండే రోజు ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. హౌస్ లో మాత్రం హీరో అయ్యాడు కానీ, బయట ఓట్లలో మాత్రం జీరో అయ్యాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఫస్ట్ నుంచీ కూడా నామినేషన్స్ లోకి వచ్చినపుడు విశ్వకి పెద్దగా ఓటింగ్ అనేది జరగలేదు. ప్రతిసారి 10శాతం లోపే ఓటింగ్ జరిగేది. అయితే, తన గేమ్ ని ఇంప్రూవ్ చేస్కుంటూ వారం వారం ఏదో రకంగా నామినేషన్స్ లోకి రాకుండా కాపాడుకుంటూ వచ్చాడు.

రెండు వారాలు కెప్టెన్ గా ఇమ్యూనిటీని సైతం పొందాడు. అయితే, ఈసారి పింకీ తనకంటే స్ట్రాంగ్ ప్లేయర్ అంటూ విశ్వని నామినేట్ చేసింది. దీంతో విశ్వ ఇప్పుడు ఇంటి నుంచీ బయటకి రావాల్సివస్తోంది. నిజానికి విశ్వకి ఈ ఓటు పడకుండా ఉండి ఉంటే నామినేషన్స్ లోకి వచ్చేవాడే కాదు. ఈసారి బిగ్ బాస్ ఒక్క ఓటు వచ్చినా కూడా నామినేషన్స్ లోకి తీస్కునివచ్చాడు. ఇందులో విశ్వతో పాటుగా అనీమాస్టర్ సైతం ఒకే ఒక్క ఓటుతో నామినేషన్స్ లోకి వచ్చింది. అయితే, బిగ్ బాస్ ఇచ్చిన ఇమ్యూనిటీ టాస్క్ లో గెలిచి సేఫ్ జోన్ లోకి వెళ్లింది. కానీ, విశ్వకి ఆ ఛాన్స్ లేకుండా పోయింది. అందుకే విశ్వ ఇప్పుడు ఇంటినుంచీ బయటకి రాక తప్పని పరిస్థితి అయ్యింది. అదీ విషయం.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus