టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి బాహుబలి2 సినిమా వరకు తన సినిమాలలో తెలుగు హీరోయిన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారనే సంగతి తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో మాత్రం జక్కన్న బాలీవుడ్, హాలీవుడ్ హీరోయిన్లను ఎంపిక చేశారు. ఈ సినిమాలో సీత పాత్ర కోసం అలియా భట్ ను ఎంపిక చేయడం వెనుక అసలు కారణాలను రాజమౌళి తాజాగా వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ మూవీలోని సీత పాత్రకు, అలియా భట్ కు దగ్గరి పోలికలు ఉన్నాయని జక్కన్న చెప్పుకొచ్చారు.
తాను ఊహించుకున్న ఆర్ఆర్ఆర్ కథలో పాత్ర ప్రకారం అలియా భట్ కు ఒదిగిపోయే స్వభావం ఉందని ఆ కారణం వల్లే ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ఆమెను ఎంపిక చేశామని జక్కన్న తెలిపారు. చరణ్ ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహం కారణంగా వాళ్లిద్దరినీ అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రల కొరకు ఎంపిక చేశానని రాజమౌళి గతంలోనే వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో వేగం పెంచి రాజమౌళి అంచనాలను అంతకంతకూ పెంచుతున్నారు.
ఈ సినిమా హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తం ఖర్చు చేశారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు 205 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కనీసం 220 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే మాత్రమే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు సైతం భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ మూవీకి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా కేసులు తగ్గడం, 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు లభించడం, తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెరగడం ఇలా ఈ సినిమాకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ సినిమా ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.