పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. ఏపీలోని పలు ఏరియాలలో టికెట్ రేట్లు తగ్గించడం వల్లే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదని అభిమానులు భావిస్తున్నారు. తాజాగా ఈ సినిమా స్టార్ మా ఛానల్ లో ప్రసారమైంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలు బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా సంచలనాలు సృష్టిస్తాయి.
అయితే భీమ్లా నాయక్ సినిమాకు మాత్రం బుల్లితెరపై కేవలం 9.06 రేటింగ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ రేంజ్, మార్కెట్ కు ఈ రేటింగ్ చాలా తక్కువని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ చిత్రానికి రేటింగ్ తగ్గడానికి కొన్ని కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. చాలామంది ప్రేక్షకులు మలయాళ సినిమా అయిన అయ్యప్పనుమ్ కోషియమ్, భీమ్లా నాయక్ లను ఇప్పటికే చూసేశారని పవన్ ఫ్యాన్స్ వెల్లడిస్తున్నారు.
భీమ్లా నాయక్ విడుదలైన నెల రోజులకే ఓటీటీలో కూడా అందుబాటులోకి వచ్చిందని ఆలస్యంగా బుల్లితెరపై స్ట్రీమింగ్ చెయ్యడం వల్లే ఈ సినిమా రేటింగ్ తగ్గిందని పవన్ ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ అర్బన్ లో ఈ సినిమా రేటింగ్ మరింత తక్కువగా ఉండటం గమనార్హం. స్టార్ మా ఛానల్ కు రీచ్ ఎక్కువ కాగా ఈ రేటింగ్ ను మాత్రం ఎవరూ ఊహించలేదు.
పవన్ మరో సినిమా వకీల్ సాబ్ మాత్రం బుల్లితెరపై ఫస్ట్ టైమ్ ప్రసారమైన సమయంలో రేటింగ్స్ విషయంలో సంచలనాలను సృష్టించిన సంగతి తెలిసిందే. పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. నిదానంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.