గత కొన్నిరోజులుగా భీమ్లా నాయక్ వాయిదా పడుతుందని వార్తలు రాగా భీమ్లా నాయక్ రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు లేదని మేకర్స్ స్పష్టతనిస్తూ వచ్చారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి నాలుగు పాటలు రిలీజ్ కావడంతో పవన్ ఫ్యాన్స్ సైతం భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ విషయంలో మార్పు ఉండదని భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా భీమ్లా నాయక్ వాయిదా గురించి ప్రకటన వెలువడింది. భీమ్లా నాయక్ వాయిదా పడటంతో రాజమౌళి ట్విట్టర్ ద్వారా పవన్ కు థ్యాంక్స్ చెప్పారు.
అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా విషయంలో కీలకంగా వ్యవహరించింది మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ అని సమాచారం. భీమ్లా నాయక్ రిలీజ్ కు కర్త, కర్మ, క్రియ త్రివిక్రమ్ అని తెలుస్తోంది. దాదాపు నెల రోజుల నుంచి రాజమౌళి, డీవీవీ దానయ్య భీమ్లా నాయక్ వాయిదా కోసం తీవ్రంగా శ్రమించారనే సంగతి తెలిసిందే. రాజమౌళి పవన్ అపాయింట్ మెంట్ కోరినా పవన్ అపాయింట్ మెంట్ జక్కన్నకు దొరకలేదు. అయితే జక్కన్న మాత్రం త్రివిక్రమ్ తో తరచూ టచ్ లో ఉంటూ చివరకు అనుకున్నది సాధించారు.
పవన్ కళ్యాణ్ రష్యాకు రెండు వారాల పాటు వెళుతున్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ మేకర్స్ త్రివిక్రమ్ పై భారం వేశారు. పవన్ కు త్రివిక్రమ్ సన్నిహితుడు కావడంతో భీమ్లా నాయక్ సులువుగా వాయిదా పడింది. భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ మారడంతో తారక్, చరణ్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. భీమ్లా నాయక్ విడుదలైతే ఆర్ఆర్ఆర్ కు హిట్ టాక్ వచ్చినా థియేటర్లు, కలెక్షన్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందే ఆర్ఆర్ఆర్ రిలీజవుతుండటంతో
రెండు వారాల పాటు ఆర్ఆర్ఆర్ రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించే ఛాన్స్ ఉంది. రాధేశ్యామ్ తో పోటీ ఉన్నా రెండు సినిమాలు భిన్నమైన కథలతో తెరకెక్కడంతో చరణ్, తారక్ ఫ్యాన్స్ కు టెన్షన్ తగ్గింది. 10,000కు పైగా స్క్రీన్లలో ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కానుంది.