విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన దాస్ కా ధమ్కీ ప్రస్తుతం థియేటర్లలో యావరేజ్ టాక్ తో ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాకు పూర్తిస్థాయిలో పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే మాత్రం మూవీ అంచనాలకు హిట్ అయ్యేది. ఊహించని రేంజ్ లో ట్విస్ట్ లు ఉండటం ఈ సినిమాకు మైనస్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే విశ్వక్ సేన్ ఈ సినిమాకు సొంతంగా డైరెక్టర్ గా వ్యవహరించకుండా ఉండి ఉంటే బాగుండేది. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోషించిన విశ్వక్ సేన్ కృష్ణదాస్ పాత్రకు న్యాయం చేసినా సంజయ్ రుద్ర పాత్రకు న్యాయం చేయలేకపోయారు.
హీరోయిన్ రోల్ కు సంబంధించిన ట్విస్ట్ మెజారిటీ ఆడియన్స్ కు నచ్చదు. విశ్వక్ సేన్ ఎంచుకున్న కథ, కథనంలో తప్పులు లేవని అయితే నచ్చిన కథను అద్భుతంగా చూపించే విషయంలో ఫెయిల్ అయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి. కథనం విషయంలో కొన్ని పొరపాట్లు జరిగాయి. దాస్ కా ధమ్కీ రిజల్ట్ విషయంలో విశ్వక్ సేన్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలి. కమర్షియల్ గా విశ్వక్ సేన్ కు ఈ సినిమా లాభాలను మిగిల్చే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ధమ్కీ2 ఉంటుందో లేదో స్పష్టత రావాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. తొలిరోజు ఈ సినిమా 4 కోట్ల రూపాయలకు అటూఇటుగా కలెక్షన్లను సాధించినట్టు తెలుస్తోంది. విశ్వక్ సేన్ 28 సంవత్సరాల వయస్సులోనే ఈ రేంజ్ లో ప్రతిభను ప్రూవ్ చేసుకున్నాడంటే గ్రేట్ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే మరికొన్ని సంవత్సరాలు విశ్వక్ డైరెక్షన్ కు దూరంగా ఉండాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.
సరైన కథలను ఎంచుకుంటే విశ్వక్ సేన్ భారీ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి. విశ్వక్ సేన్ తో సినిమాలను నిర్మించడానికి చాలామంది దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య సపోర్ట్ చేస్తుండటం విశ్వక్ సేన్ కు ప్లస్ అవుతోంది.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?