పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ ఎంతమంచి స్నేహితులో పత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్, అలీ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. పవన్ తన సినిమాలో అలీకి కచ్చితంగా పాత్ర ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అలీ సైతం చాలా సందర్భాల్లో పవన్ గురించి గొప్పగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అయితే 2019 ఎన్నికల సమయం నుండి పవన్, అలీ మధ్య గ్యాప్ వచ్చింది.
అలీ కూతురి పెళ్లికి పవన్ ను ఆహ్వానించినా వేర్వేరు కారణాల వల్ల పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కు హాజరు కాలేదు. తాజాగా పవన్ ఇన్ స్టాగ్రామ్ లో చేసిన తొలి పోస్ట్ లో దాదాపుగా అందరు సినీ ప్రముఖులతో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నారు. అయితే ఈ జాబితాలో అలీకి మాత్రం చోటు దక్కలేదు. పవన్ ఈ విధంగా చేయడంతో పవన్ కళ్యాణ్ అలీని ఎప్పటికీ క్షమించరా అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అలీ మాత్రం పలు సందర్భాల్లో పవన్ తో తనకు గ్యాప్ లేదని చెప్పిన సంగతి తెలిసిందే. పవన్ తన సినిమాలలో అలీకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నా ఇతర కమెడియన్లకు ఎక్కువగా అవకాశాలను ఇస్తుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ అలీ మధ్య గ్యాప్ తగ్గితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్, అలీలను అభిమానించే అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉంది. పవన్, అలీ చిన్నచిన్న మనస్పర్ధలను తొలగించుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మరోవైపు పవన్ (Pawan Kalyan) నటించిన బ్రో సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. బ్రో సినిమా కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. హరీష్ శంకర్ త్వరలో రవితేజ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.