Gunasekhar: ఆ రీజన్ల వల్లే గుణశేఖర్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయా?

చూడాలని ఉంది, ఒక్కడు సినిమాల విజయాలతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపును సంపాదించుకున్న గుణశేఖర్ కు గత 5 సినిమాలలో 4 సినిమాల ఫలితాలు భారీ షాకిచ్చాయి. సైనికుడు, వరుడు, నిప్పు, రుద్రమదేవి, శాకుంతలం సినిమాలలో రుద్రమదేవి మినహా మిగతా సినిమాలన్నీ బయ్యర్లను ముంచేశాయి. గుణశేఖర్ సినిమా అంటే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. కథ, కథనాలలోని లోపాల వల్లే ఈ నాలుగు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి.

గుణశేఖర్(Gunasekhar) సెట్స్ పై, విజువల్ ఎఫెక్ట్స్ పై పెట్టే శ్రద్ధ కథ, కథనంపై పెట్టడం లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గుణశేఖర్ గత సినిమాల పొరపాట్లను సరిదిద్దుకుని ఉంటే శాకుంతలం సినిమాకు ఇలాంటి రెస్పాన్స్ వచ్చేది కాదు. రుద్రమదేవి సినిమా సక్సెస్ సాధించినా ఆ సినిమా మరీ బ్లాక్ బస్టర్ హిట్టేం కాదు. ఒక్కో సినిమాకు రెండు నుంచి మూడేళ్ల సమయం కేటాయిస్తున్న గుణశేఖర్ అన్నేళ్ల పాటు కష్టపడినా సినిమాను అద్భుతంగా తెరకెక్కించే విషయంలో ఫెయిల్ అవుతున్నారు.

రాజమౌళిలా సినిమాలు తీయాలంటే కథ, కథనం విషయంలో అదే స్థాయిలో కృషి జరగాలి. అప్పుడు మాత్రమే సినిమాలు పాజిటివ్ ఫలితాలను అందుకునే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. గుణశేఖర్ సినిమాలకు గుడ్ బై చెప్పాలని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంటే శాకుంతలం సినిమా వారిని ఏ స్థాయిలో నిరాశపరిచిందో సులువుగానే అర్థమవుతుంది. గుణశేఖర్ స్థాయి అంతకంతకూ తగ్గుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పరిమిత బడ్జెట్ తో గుణశేఖర్ సినిమాలను తెరకెక్కిస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కామెంట్ల విషయంలో గుణశేఖర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. దర్శకునిగా తన స్థాయిని పెంచే సినిమాలపై గుణశేఖర్ దృష్టి పెట్టాల్సి ఉంది. గుణశేఖర్ ను నమ్మే నిర్మాతలు కూడా లేరని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus