Mahesh Babu, Shankar: మహేష్ శంకర్ కాంబో మూవీ అలా ఆగిందా?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో మహేష్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనున్నట్టు కొన్నేళ్ల క్రితం వార్తలు వచ్చాయి. అయితే ఊహించని విధంగా ఆ సినిమా ఆగిపోయింది. త్రీ ఈడియట్స్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ కు బదులుగా విజయ్ నటించారు. మహేష్ రీమేక్ సినిమాలో నటించడం ఇష్టం లేకపోవడం వల్లే ఆ సినిమాకు నో చెప్పినట్టు కొన్నేళ్ల క్రితం ప్రచారం జరిగింది. త్రీ ఈడియట్స్ రీమేక్ స్నేహితుడు ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించకపోవడంతో మహేష్ నిర్ణయం కరెక్ట్ అని చాలామంది భావించారు.

అయితే మహేష్ దూకుడు సినిమా కోసమే శంకర్ సినిమాలో అవకాశాన్ని వదులుకున్నాడని శ్రీను వైట్ల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దూకుడు మూవీలో ఒక ఇంపార్టెంట్ సీన్ రాసి మహేష్ కు వినిపించగా ఆ సీన్ మహేష్ కు ఎంతగానో నచ్చిందని శ్రీనువైట్ల తెలిపారు. ఆ తర్వాత మహేష్ నమ్రతకు ఫోన్ చేసి దూకుడుపై ఫుల్ ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నానని ఆ రీజన్ వల్లే శంకర్ మూవీ చేయడం లేదని చెప్పాడని శ్రీను వైట్ల పేర్కొన్నారు.

తాను శంకర్ కు పెద్ద ఫ్యాన్ కావడంతో ఆ సినిమాను వదులుకోవద్దని మహేష్ కు చెప్పగా మహేష్ మాత్రం దూకుడుకే ప్రాధాన్యత ఇచ్చారని శ్రీనువైట్ల వెల్లడించారు. మహేష్ శంకర్ కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది. శంకర్ ప్రస్తుతం చరణ్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus