గత కొన్నేళ్లలో ఓటీటీల హవా ఊహించని రేంజ్ లో పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీల హవా పెరగడం వల్ల రీమేక్ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి అంతకంతకూ తగ్గుతోంది. గతంలో మలయాళీ రీమేక్ లతో టాలీవుడ్ హీరోలకు సక్సెస్ దక్కినా ఇప్పుడు మాత్రం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మధ్య కాలంలో దృశ్యం, భీమ్లా నాయక్, ప్రేమమ్ మినహా మలయాళీ రీమేక్ సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి. లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేదు.
ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయడంలో ఫెయిలైంది. కప్పెలా రీమేక్ బుట్టబొమ్మ కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. జోసెఫ్ రీమేక్ శేఖర్ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను మిగిల్చింది. ఈ సినిమాలు ప్రేక్షకులకు ఎందుకో కనెక్ట్ కాలేదు. తాజాగా డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ సెల్ఫీ సినిమా ఏ రేంజ్ లో డిజాస్టర్ గా నిలిచింది.
తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేయాలని ప్రయత్నాలు జరగగా సెల్ఫీ రిజల్ట్ తో ఈ సినిమా ఫలితం తేలిపోయింది. బాడీగార్డ్ మూవీ తెలుగు వెర్షన్ సైతం ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. రాబోయే రోజుల్లో మలయాళీ రీమేక్ లకు టాలీవుడ్ హీరోలు దూరంగా ఉండే అవకాశం అయితే ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలు భిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
మలయాళీ రీమేక్ లను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ నిర్మాతలకు భారీ నష్టాలను మిగుల్చుతున్నాయి. టాలీవుడ్ హీరోలు రీమేక్ లకు దూరంగా ఉంటే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ స్టార్స్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. టాలీవుడ్ హీరోలు ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలుగా మార్కెట్ ను పెంచుకోవడానికి కృషి చేస్తున్నారు. ఓటీటీల వల్లే ఈ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.