మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికై సరిగ్గా ఏడాది అయింది. ఏడాదిలో మెజారిటీ హామీలను నెరవేర్చానని విష్ణు చెబుతుండగా విష్ణు నిజంగానే హామీలను నెరవేర్చాడా అనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కొన్ని కొత్త నిర్ణయాల అమలుకు సిద్ధమయ్యారు. ఈ నిబంధనల వల్ల వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పోటీ చేసే అవకాశం ఉండదని తెలుస్తోంది.
ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత ప్రకాష్ రాజ్ తన సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ప్రచారం జరిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టినా ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉండదని విష్ణు తెలిపారు. మీడియాకు ఎక్కిన వాళ్ల సభ్యత్వాలను శాశ్వతంగా రద్దు చేస్తానని విష్ణు చెప్పుకొచ్చారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు వ్యతిరేకంగా ధర్నాలు చేసినా సభ్యత్వం రద్దు అవుతుందని విష్ణు కామెంట్లు చేశారు.
ఈ నిర్ణయాలను మంచు విష్ణు కచ్చితంగా అమలు చేస్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షునిగా పోటీ చేయడానికి ప్రకాష్ రాజ్ కు అర్హత ఉండకపోవచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో విష్ణుకు పోటీ చేసే ఆలోచన లేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. మంచు విష్ణు కామెంట్ల గురించి ప్రకాష్ రాజ్ నుంచి ఏదైనా రియాక్షన్ వస్తుందేమో చూడాలి.
మరోవైపు కెరీర్ పరంగా మంచు విష్ణుకు ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేదు. జిన్నా సినిమాతో మంచు విష్ణు కెరీర్ పరంగా భారీ సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విష్ణు ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్లను ఎంపిక చేసుకున్నారు. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండగా సినిమా కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందేమో చూడాలి. పాయల్ రాజ్ పుత్ కు ఈ సినిమా సక్సెస్ కీలకమనే సంగతి తెలిసిందే.