Animal OTT: యానిమల్ ఓటీటీ వెర్షన్ లో కొత్త సీన్లు లేకపోవడానికి రీజన్లు ఇవేనా?

రణ్ బీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కిన యానిమల్ మూవీ ఓటీటీ వెర్షన్ తాజాగా విడుదలైంది. తెలుగుతో పాటు అన్ని భాషల్లో యానిమల్ ఓటీటీ వెర్షన్ రిలీజైంది. అయితే ఓటీటీ వెర్షన్ లో అదనపు సన్నివేశాలు ఉంటాయని భావించిన ఫ్యాన్స్ కు భారీ షాక్ తగిలింది. ఎలాంటి ఎక్స్ట్రా సీన్లు లేకపోవడం వల్ల ఓటీటీ వెర్షన్ ను చూసిన ఫ్యాన్స్ ఒకింత నిరాశకు గురవుతున్నారు. అయితే యానిమల్ ఓటీటీ వెర్షన్ లో కొత్త సీన్లు లేకపోవడానికి రీజన్లు ఇవేనంటూ కొన్ని కారణాలు వైరల్ అవుతున్నాయి.

ఒకటి రెండు షాట్స్ మినహా యానిమల్ ఓటీటీ వెర్షన్ లో మార్పులు లేవు. సెన్సార్ చేసిన కంటెంట్ ను మాత్రమే నెట్ ఫ్లిక్స్ సినిమాలకు సంబంధించి స్ట్రీమింగ్ చేస్తున్న నేపథ్యంలో కొత్త సీన్లను యాడ్ చేయలేదని తెలుస్తోంది. గతంలో కూడా పలు సినిమాల విషయంలో ఇదే విధంగా జరిగింది. అయితే థియేటర్లలో వేర్వేరు కారణాల వల్ల యానిమల్ సినిమాను చూడని వాళ్లు మాత్రం ఓటీటీలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 900 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో సైతం రికార్డ్ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంటోందని తెలుస్తోంది. సలార్, యానిమల్ సినిమాల స్ట్రీమింగ్ వల్ల నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రైబర్ల సంఖ్య మరింత పెరిగిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. యానిమల్ సినిమా సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో సీక్వెల్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాల్సి ఉంది.

సందీప్ రెడ్డి వంగా సినిమాలు నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందిస్తున్నాయి. గ్రాఫిక్స్ తో అవసరం లేకుండా, కథకు అవసరమైనంత బడ్జెట్ తో సినిమాలను (Animal ) నిర్మిస్తూ సందీప్ రెడ్డి వంగా వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus