Prabhas: ప్రభాస్ ను పిలవడానికి జక్కన్నకు సమస్య ఇదే!

స్టార్ హీరో ప్రభాస్ కు పాన్ ఇండియా హీరోగా ఉన్న క్రేజ్, గుర్తింపు అంతాఇంతా కాదు. బాలీవుడ్ లో సైతం ప్రభాస్ సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోలను మించి ప్రభాస్ పారితోషికం తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు సైతం ప్రభాస్ అడిగినంత పారితోషికం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభాస్ ఈ మధ్య కాలంలో ఇతర హీరోల సినిమాల ఈవెంట్లకు హాజరవుతూ ఆ సినిమాలపై అంచనాలు పెరగడానికి కారణమవుతున్నారు.

ప్రభాస్ వల్ల సినిమాలకు హైప్ వస్తుండటంతో చిన్న, మిడిల్ రేంజ్ హీరోలు తమ సినిమాల ఫంక్షన్లకు ప్రభాస్ ను ఆహ్వానిస్తున్నారు. అయితే రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన బాహుబలి సిరీస్ వల్లే ప్రభాస్ కు ఈ స్థాయిలో పాపులారిటీ వచ్చింది. రాజమౌళి ప్రభాస్ ను రంగంలోకి దింపితే బాహుబలి క్రేజ్ ఆర్ఆర్ఆర్ సినిమాకు యాడ్ అవుతుంది. అయితే సంక్రాంతికి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వారం రోజుల గ్యాప్ లో రిలీజవుతున్నాయి. రాజమౌళి, ప్రభాస్ సినిమాలు ఒకే సమయంలో రిలీజవుతున్న నేపథ్యంలో

ప్రభాస్ ఆర్ఆర్ఆర్ ను ప్రమోట్ చేస్తే రాధేశ్యామ్ పై ప్రతికూల ప్రభావం పడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ రీజన్ వల్లే రాజమౌళి సైతం ప్రభాస్ ను పిలవడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే జక్కన్న కోరితే మాత్రం ప్రభాస్ ఆర్ఆర్ఆర్ ను కచ్చితంగా ప్రమోట్ చేస్తారు. జక్కన్న ప్రభాస్ క్రేజ్ ను ఆర్ఆర్ఆర్ కోసం వాడుకుంటారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus