Priyanka Chopra: ఆ ప్రకటనల్లో నటించినందుకు విచారిస్తున్నా.. ప్రియాంక కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో పాపులారిటీని కలిగి ఉన్న హీరోయిన్లలో ప్రియాంక చోప్రా ఒకరు కాగా వరుస ఇంటర్వ్యూల ద్వారా ప్రియాంక చోప్రా వార్తల్లో నిలుస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ హిందీ సినీ ఇండస్ట్రీ కొందరి చేతుల్లో ఏకీకృతం కావడం నిజమేనని కామెంట్లు చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయని ఆమె చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ మూవీ బాలీవుడ్ మూవీ కాదని అది తమిళ మూవీ అని అన్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీ గురించి ప్రియాంక చోప్రా ఈ విధంగా కామెంట్ చేయడంతో అభిమానులు తెగ ఫీలవుతున్నారు. ఆర్ఆర్ఆర్ గురించి ప్రియాంక చోప్రాకు ఈ మాత్రం అవగాహన కూడా లేదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే బాలీవుడ్ గురించి ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. బాలీవుడ్ రాజకీయాలతో విసిగిపోవడం వల్లే తాను హాలీవుడ్ పై దృష్టి పెట్టానని ఆమె అన్నారు. హిందీలో నన్ను ఓ మూలకు తోసేశారని బాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకోవాలని భావించి అమెరికాకు వచ్చానని ఆమె చెప్పుకొచ్చారు.

మేకప్ వల్ల చాలా సినిమాల్లో నేను కొత్తగా కనిపించానని పాల రంగులో కనిపించడం కోసం నేను చాలా కష్టపడ్డానని ఆమె పేర్కొన్నారు. ఇందుకోసం కొన్ని కఠిన ఉత్పత్తులు వాడానని ఆమె పేర్కొన్నారు. స్టార్ హీరోలతో కలిసి కొన్ని ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్స్ లో నటించానని ప్రియాంక చోప్రా కామెంట్స్ చేశారు. ఆ యాడ్స్ లో నటించినందుకు ఇప్పుడు ఫీలవుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

చాలామంది ఆ క్రీమ్ ను వాడేవాళ్లు అని అది అతిపెద్ద బ్యూటీ బ్రాండ్ కావడం వల్ల ఆ యాడ్ లో నేను నటించాల్సి వచ్చిందని ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తెలిపారు. ప్రియాంక చోప్రా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రియాంక చోప్రా ప్రాజెక్ట్ ల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus