Radhe Shyam: కోపంతో వాళ్లను టార్గెట్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్!

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా గతేడాది జులై నెలలోనే రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా పరిస్థితుల వల్ల మేకర్స్ ఈ సినిమాను వాయిదా వేశారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా వల్ల మరోసారి వాయిదా పడింది. అయితే రాధేశ్యామ్ కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో ప్రకటన వస్తుందని భావించిన అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది.

ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు సంబంధించి ఆ సినిమా మేకర్స్ రెండు రిలీజ్ డేట్లను ప్రకటించగా రాధేశ్యామ్ మేకర్స్ మాత్రం రిలీజ్ డేట్ ను ప్రకటించకపోవడం ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. మరోవైపు రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా అభిమానులు సంతృప్తితో లేరు. అందువల్ల కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ రాధేశ్యామ్ ఓటీటీలో విడుదల కానుందంటూ ఫేక్ న్యూస్ ను వైరల్ చేశారు.

రాధేశ్యామ్ సినిమాకు 400 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందని జీ5 యాప్ లేదా నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ కానుందని ఫేక్ వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే రాధేశ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ట్విట్టర్ ద్వారా రాధేశ్యామ్ థియేటర్లలోనే రిలీజవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఈ విధంగా చేయడం ద్వారా రాధేశ్యామ్ మేకర్స్ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారని ప్రభాస్ ఫ్యాన్స్ భావించగా వాళ్లకు నిరాశ ఎదురవుతోంది. రాధేశ్యామ్ దర్శకనిర్మాతలు అతి త్వరలో రిలీజ్ డేట్ ను ప్రకటించకపోతే మాత్రం వాళ్లు మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పవచ్చు.

రాధేశ్యామ్ మేకర్స్ సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్ డేట్ ఇస్తే తప్ప ప్రభాస్ అభిమానులు కూల్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. రాధేశ్యామ్ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. ఊహించని ట్విస్టులతో తెరకెక్కిన ఈ ప్రేమకథ కొరకు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆసక్తి ఎదురుచూస్తున్నారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus