RRR, Pushpa: రాజమౌళి, సుకుమార్ నిర్ణయాలు మారడానికి అదే కారణమా?

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్, సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు దుబాయ్ లో జరగనున్నాయని వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. దుబాయ్ లో ఈవెంట్స్ చేయడం ద్వారా ఈ సినిమాలకు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతుందని ఈ రెండు సినిమాల మేకర్స్ భావించారు. అయితే మారిన పరిస్థితుల వల్ల దుబాయ్ ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి, సుకుమార్ నిర్ణయాలు మారాయని సమాచారం.

తెలుస్తున్న సమాచారం ప్రకారం దుబాయ్ లో ఈవెంట్ చేయాలంటే భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరోవైపు కరోనా భయం మేకర్స్ ను టెన్షన్ పెడుతోందని కొన్ని ప్రాంతాల్లోకేసులు పెరగడంతో ఈవెంట్ విషయంలో ఆర్ఆర్ఆర్ మేకర్స్ వెనక్కు తగ్గారని సమాచారం. పుష్ప మేకర్స్ కూడా దాదాపుగా ఇవే కారణాలతో ఈవెంట్ వద్దని అనుకున్నారని తెలుస్తోంది. రెండు పాన్ ఇండియా సినిమాలకు ఇదే ఇబ్బంది ఎదురైందని సమాచారం. దుబాయ్ ఈవెంట్ కు బదులుగా వివిధ వెన్యూలలో ఈవెంట్లను నిర్వహించాలని ఆర్ఆర్ఆర్, పుష్ప మేకర్స్ భావిస్తున్నట్టు బోగట్టా.

ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాలలో ఈ సినిమాల ఈవెంట్లు జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరోవైపు ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచాల్సి ఉంది. పుష్ప, ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ టాలీవుడ్ ఖ్యాతిని మరింత పెంచుతాయని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ మూడు సినిమాల బడ్జెట్ ఏకంగా 1,000 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus