Sai Pallavi: టాలీవుడ్ టాప్ హీరోలకు జోడీగా సాయిపల్లవి అందుకే నటించడం లేదా?

భాషతో సంబంధం లేకుండా ఊహించని స్థాయిలో క్రేజ్ ను కలిగి ఉన్న హీరోయిన్లలో సాయిపల్లవి (Sai Pallavi) ఒకరు కాగా ఈ హీరోయిన్ కు ప్రేక్షకుల్లో క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులతో సాయిపల్లవి అరుదైన రికార్డ్ ను ఖాతాలో వేసుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. తండేల్ (Thandel) , బాలీవుడ్ రామాయణ్ సినిమాలతో ప్రస్తుతం సాయిపల్లవి బిజీగా ఉన్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ స్టార్లకు జోడీగా సాయిపల్లవి నటించకపోవడం గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.

ప్రధానంగా స్టార్ హీరోలకు జోడీగా ఆఫర్లు రాకపోవడానికి సాయిపల్లవి పాటించే కొన్ని నిబంధనలు ఒక విధంగా కారణమైతే యాక్టింగ్ లో డాన్స్ లో సాయిపల్లవి డామినేట్ చేస్తుందనే టాక్ ఉండటం ఆమెకు ఒక విధంగా మైనస్ అయిందని చెప్పవచ్చు. ఈ కారణాల వల్లే సాయిపల్లవికి టాప్ హీరోలు ఛాన్స్ ఇవ్వరని చాలామంది భావిస్తారు. సాయిపల్లవి గ్లామర్ షోకు అంగీకరించరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సాయిపల్లవి పారితోషికం 2.5 కోట్ల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. సాయిపల్లవి కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సాయిపల్లవి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటుండగా రాబోయే రోజుల్లో అయినా టైర్1 హీరోలకు జోడీగా సాయిపల్లవి నటిస్తారేమో చూడాల్సి ఉంది. సాయిపల్లవి భవిష్యత్తులో డాక్టర్ గా కూడా కెరీర్ ను కొనసాగించే అవకాశం ఉంది.

సాయిపల్లవి క్రేజ్ ను చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం షాకవుతుండటం గమనార్హం. సాయిపల్లవికి మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. సాయిపల్లవి ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సాయిపల్లవి రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus