The GOAT: ది గోట్ ట్రైలర్ కు నెగిటివ్ టాక్ రావడానికి అసలు కారణాలు ఇవేనా?
- August 19, 2024 / 12:18 PM ISTByFilmy Focus
కోలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో విజయ్ (Vijay Thalapathy) ఒకరు కాగా సెప్టెంబర్ నెల 5వ తేదీన విజయ్ నటించిన ది గోట్ (The Greatest of All Time ) మూవీ థియేటర్లలో విడుదల కానుంది. వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై ఒకింత భారీ స్థాయిలోనే అంచనాలు నెలకొన్నాయి. ఈ ట్రైలర్ కు యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండగా విజయ్ లుక్ విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ సినిమాలో విజయ్ యంగ్ లుక్ ను చూసిన నెటిజన్లు ఆచార్య (Acharya) సినిమాలో చిరంజీవి (Chiranjeevi) యంగ్ లుక్ ను గుర్తు చేసే విధంగా ఈ లుక్ ఉందని కామెంట్లు చేస్తుండటం కొసమెరుపు.
The GOAT

ది గోట్ ట్రైలర్ కు నెగిటివ్ టాక్ రావడానికి విజయ్ లుక్ ఒక విధంగా కారణం అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ది గోట్ ట్రైలర్ కు తమిళ ప్రేక్షకుల నుంచి మాత్రం పాజిటివ్ టాక్ వస్తుండటం కొసమెరుపు. ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. వెంకట్ ప్రభు మాత్రం ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంటాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

ది గోట్ మూవీ బడ్జెట్ ఏకంగా 300 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. ది గోట్ (The GOAT) మూవీ వినాయకచవితి కానుకగా థియేటర్లలో విడుదల కానుండగా పెద్దగా పోటీ లేకుండా ఈ సినిమా విడుదలవుతోంది. విజయ్ కు సోషల్ మీడియా వేదికగా క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. రాబోయే రోజుల్లో విజయ్ రేంజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

విజయ్ కెరీర్ పరంగా మరింత ఎదిగి మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. విజయ్ చివరి రెండు సినిమాలు ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
#TheGreatestOfAllTime #ThalapathyIsTheGOAT#TheGreatestOfAllTime
Goat. Acharya pic.twitter.com/UT7WjCB2Sd— santhosh_3840_d (@aavesham_) August 17, 2024















