ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ లో రాజమౌళి కుటుంబ సభ్యులంతా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ కు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ మాత్రం కనిపించడం లేదు. సాధారణంగా విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి సినిమాల ప్రమోషన్స్ లో పాల్గొంటూ కీలక విషయాలను పంచుకుంటూ ఉంటారు. అయితే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కు విజయేంద్ర ప్రసాద్ దూరంగా ఉండటానికి ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. విజయేంద్ర ప్రసాద్ ఆరోగ్య సమస్యల వల్ల, వయస్సు వల్ల ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కు దూరంగా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
గతేడాది ఏప్రిల్ నెలలో విజయేంద్ర ప్రసాద్ కు కరోనా నిర్ధారణ అయింది. ఆ తర్వాత విజయేంద్ర ప్రసాద్ మీడియా ముందు ఎక్కువగా కనిపించలేదు. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ ఒకవైపు మహేష్ సినిమా స్క్రిప్ట్ పనులు చేస్తూనే మరోవైపు విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుస్తోంది. జక్కన్న సక్సెస్ లో విజయేంద్ర ప్రసాద్ పాత్ర ఎంతో ఉందని చెప్పవచ్చు. అయితే ఆర్ఆర్ఆర్ ఈవెంట్లలో, ఇంటర్వ్యూలలో విజయేంద్ర ప్రసాద్ కనిపించలేదు. ఇంటర్వ్యూలలో విజయేంద్ర ప్రసాద్ ను మిస్ అవుతున్నామని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు.
రాజమౌళి ఇంటర్వ్యూలలో ఈ విషయానికి సంబంధించి క్లారిటీ ఇస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్ పై తన కథతో విజయేంద్ర ప్రసాద్ హైప్ పెంచారు. ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. రెమ్యునరేషన్లతో కలిపి 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి. మరోవైపు ఆర్ఆర్ఆర్ కథ విషయంలో ప్రేక్షకుల్లో చాలా సందేహాలు నెలకొన్నాయి.
సినిమా రిలీజైతే మాత్రమే ఈ సినిమాలోని అనేక పాత్రలకు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. రాహుల్ రామకృష్ణ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. సినిమా రిలీజైన తర్వాత కూడా ప్రమోషన్స్ కొనసాగేలా జక్కన్న జాగ్రత్తలు తీసుకుంటున్నారని బోగట్టా.