Chiranjeevi: అన్ స్టాపబుల్ కు మెగాస్టార్ రాకపోవడం వెనుక ఇంత జరిగిందా?

బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ షో సీజన్1, అన్ స్టాపబుల్ సీజన్2 ఏ స్థాయిలో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య టాక్ షోకు ముందు తర్వాత చాలా షోలు వచ్చినా ఈ షో స్థాయిలో ప్రేక్షకులకు నచ్చలేదు. బాలయ్య ఒప్పుకోవడమే అన్ స్టాపబుల్ షో సక్సెస్ కు కారణమని బీవీఎస్ రవి తెలిపారు. సినిమాలలో బాలయ్య పాత్రలను చూస్తామని బయట బాలయ్య వేరు అని ఆయన వెల్లడించారు.

బాలయ్య చాలా మెచ్యూర్డ్ పర్సన్ అని బీవీఎస్ రవి పేర్కొన్నారు. తను చెప్పింది చెయ్యకపోతే బాలయ్యకు కోపం వస్తుందని ఆయన తెలిపారు. ఇంగ్లీష్ మూవీస్, బుక్స్, కల్చర్, పూజలపై బాలయ్యకు అవగాహన ఎక్కువని ఆయన దగ్గర గాలి కబుర్లు ఉండవని బీవీఎస్ రవి అన్నారు. ఫస్ట్ సీజన్ సమయంలో చిరంజీవి కోసం ప్రయత్నించగా డేట్ల విషయంలో క్లాష్ అయ్యాయని బీవీఎస్ రవి వెల్లడించడం గమనార్హం.

అన్ స్టాపబుల్2 సీజన్ సమయంలో అటు బాలయ్య, ఇటు (Chiranjeevi) చిరంజీవి తమ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారని ఆయన తెలిపారు. బాలయ్య ఉదయం మూవీ షూటింగ్ లో సాయంత్రం అన్ స్టాపబుల్ షో షూటింగ్ లో పాల్గొనేవారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో బాలయ్య చిరంజీవి కాంబినేషన్ ను అన్ స్టాపబుల్ షోలో చూసే అవకాశం ఉంది. బాలయ్య, చిరంజీవి ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. బాలయ్య తర్వాత మూవీ ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ కానుంది. బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య ఈ సినిమాతో హ్యాట్రిక్ ను సొంతం చేసుకుంటారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus