నటుడు రాజా.. అంటే ఇప్పటి నటుడు కాదండోయ్.. ఒకప్పటి నటుడు. అవును 1980 లలో రాజా పేరుతో ఇంకో నటుడు ఉండేవాడు. చూడ్డానికి ఆరడుగుల ఎత్తు, మంచి రంగు..అప్పటి అమ్మాయిలకి ఆ రోజుల్లో ఇతను మరో జగపతి బాబు, శోభన్ బాబు అనుకోవాలి. ఇతనితో పాటు నందమూరి కుటుంబానికి చెందిన కళ్యాణ్ కి అప్పట్లో లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉండేది. కానీ ఎందుకో వీళ్లిద్దరు హీరోలుగా నిలబడలేకపోయారు. ఇద్దరూ కూడా రొమాంటిక్ కింగ్స్ అని చెప్పొచ్చు.
రాజా(Raja) .. మొదట్లో యంగ్ హీరోగా చేసాడు. తర్వాత సీనియర్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసేవాడు. సినిమాల్లో ఇతని పాత్రలు ఒకేలా ఉండేవి అనే కంప్లైంట్ ఉన్నా.. వేరే ఆప్షన్ లేక ఆ పాత్రలు అన్నీ ఇతన్నే వెతుక్కుంటూ వచ్చేవి. మొదట అమాయకుడిగా కనిపించడం.. తర్వాత కన్నింగ్ పర్సన్ లా మారిపోవడం.. చివరికి మళ్ళీ మంచోడిలా మారిపోవడం. ఇతను నటించిన సినిమాల్లో దాదాపు ఇలాంటి పాత్రలే. అందుకే ఇతను త్వరగానే ఫేడౌట్ అయిపోయాడు.
ఆ తర్వాత బుల్లితెర పై అన్వేషిత, ఋతురాగాలు వంటి సీరియల్స్ లో నటించాడు కానీ అలా కూడా సక్సెస్ కాలేదు. ఇక రాజా.. మన జూ.ఎన్టీఆర్ కి బాబాయ్ అవుతాడు అనే సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు. ఎన్టీఆర్ తల్లి షాలిని సోదరిని రాజా పెళ్లి చేసుకున్నాడు. తర్వాత రాజా ఓ సినిమాలో నటిస్తుండగా గుండెపోటుతో మరణించాడు. ఇతను బ్రతికుంటే ఎన్టీఆర్ సినిమాల్లో కనిపిస్తూ ఉండేవాడేమో.