‘బిగ్ బాస్4’ ప్రారంభమయ్యి వారం రోజులు దాటిన సంగతి తెలిసిందే.మొదటి వారం పూర్తవ్వగానే సూర్య కిరణ్ ఎలిమినేట్ అయ్యాడు. నిజానికి ఇతను హౌస్లో పెద్దగా మాట్లాడటం.. ఆర్గ్యుమెంట్లు చెయ్యడంతో ఇతన్ని నామినేట్ చేసారు హౌస్మేట్స్. ఇక ఇప్పటి ప్రేక్షకులకు ఇతను ఎవరో పెద్దగా తెలియకపోవడం వల్ల ఓట్లు పడలేదు. అందుకే ఎలిమినేట్ అయిపోయాడు. నిజానికి సూర్య కిరణ్ డైరెక్టర్ మాత్రమే కాదు. చైల్డ్ ఆర్టిస్ట్ కూడా..! ఇతని అసలు పేరు సురేష్. చిన్నప్పటి నుండీ అందరూ ఇతన్ని మాస్టర్ సురేష్ అని పిలిచేవారట. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ,హిందీ భాషల్లో.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించాడు సూర్య కిరణ్.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన.. ‘రాక్షసుడు’ ‘దొంగమొగుడు’ ‘మగధీరుడు’ ‘కొండ వీటి రాజా’ ‘స్వయంకృషి’ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అంతేకాదు అర్జున్, కృష్ణంరాజు వంటి హీరోలకు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసాడు.నాగార్జునతో ‘సంకీర్తనలు’ సినిమాలో కూడా నటించాడు. ఇక బాలీవుడ్లో రాజేష్ ఖన్నా, మిథున్ చక్రవర్తి, తమిళ్ లో రజినీ కాంత్ వంటి హీరోలకు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసాడు సూర్య కిరణ్. డైరెక్టర్ గా మారాలి అని నిశ్చయించుకున్నప్పుడు సూర్య కిరణ్ గా పేరు మార్చుకున్నాడు. నాగార్జున నిర్మించిన ‘సత్యం’ చిత్రం.. సూర్యకిరణ్ కు అలాగే సుమంత్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఆ తరువాత సుమంత్ తో మళ్ళీ ‘ధన 51’ అనే చిత్రం చేసాడు సూర్య కిరణ్. కానీ అది ఫ్లాప్ అయ్యింది. జగపతి బాబు ‘బ్రహ్మాస్త్రం’, మంచు మనోజ్ ‘రాజు భాయ్’ వంటి చిత్రాలను డైరెక్ట్ చేసింది కూడా సూర్య కిరణే..!అవి కూడా పెద్దగా ఆడలేదు. ఇదిలా ఉండగా.. సూర్య కిరణ్ కు అలాగే దివంగత సంగీత దర్శకుడు చక్రి మంచి స్నేహితుడు. అతని ద్వారా సూర్య కిరణ్ కు అప్పటి స్టార్ హీరోయిన్ కళ్యాణితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వీళ్ళను పెళ్లి చేసుకునే వరకూ తీసుకెళ్లింది. కానీ కొంత కాలానికే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఇతనితో విడిపోయాక మళ్ళీ కళ్యాణి.. ‘మున్నా’ ‘ఆపరేషన్ దుర్యోధన’ ‘యాత్ర’ ‘ట్యాక్సీవాలా’ వంటి చిత్రాల్లో నటించింది.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
Most Recommended Video
బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!