దివంగత నటి విజయ నిర్మల గారు గతేడాది అంటే 2019 జూన్ 27న ఈ లోకాన్ని విడిచిపోయిన సంగతి తెలిసిందే. ఈమె 73 ఏళ్ళ వరకూ జీవించారు.1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో స్థిరపడ్డ ఓ తెలుగు కుటుంబంలో విజయ నిర్మల గారు జన్మించారు. తన 11వ ఏటనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొత్తంగా ఆమె 200కు పైగా చిత్రాల్లో నటించారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు గాను.. ఈమె 2002లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే.
ఈమె సూపర్ స్టార్ కృష్ణ గారికి రెండవ భార్య అన్న సంగతి తెలిసిందే. అయితే అంతకు ముందే ఈమెకు వేరే వ్యక్తితో పెళ్ళైన సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. అతనితో ఈమెకు అభిప్రాయభేదాలు రావడంతో విడిపోయిన.. కొన్నాళ్ళ తరువాత ఈమె కృష్ణ గారిని పెళ్ళి చేసుకుంది.ఇదిలా ఉండగా.. మన సహజనటి జయసుధ గారు కూడా విజయ నిర్మల గారికి దగ్గర బంధువు అన్న సంగతి బహుశా చాలా మందికి తెలిసి ఉండదు. జయసుధ గారికి విజయ నిర్మల గారు అత్త అవుతారు.
కృష్ణ-విజయ నిర్మల కాంబినేషన్లో వచ్చిన ‘పండంటి కాపురం’ చిత్రంలో జయసుధ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. విజయ నిర్మల గారే ఆమెను ఈ పాత్రకు ఎంచుకుని ఇండస్ట్రీకి పరిచయం చేశారట. అటు తరువాత జయసుధ ఎన్నో చిత్రాల్లో హీరోయిన్ గా నటించడం.. ఇక ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. సహజ నటి అని గుర్తింపు తెచ్చుకోవడం మనం చూస్తూనే వచ్చాం. కృష్ణ గారి ఇంట్లో ఏ వేడుక జరిగినా జయసుధ గారు కుటుంబంతో సహా హాజరవుతూ ఉంటారు.