Shivani, Niharika: ఆ విషయంలో రాజశేఖర్, నాగ బాబు కూతుర్లు సేమ్ టు సేమ్ అట..!

మెగా డాటర్ నిహారిక కు అలాగే రాజశేఖర్ కూతురు శివానీ మధ్య ఉన్న రిలేషన్ ను గమనించారా? అదేంటి అంటే.. నాగ బాబు కూతురిగా నిహారిక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. నాగబాబు కూడా కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. ఇక రాజశేఖర్ కూడా రాణించాడు. ఇక వీళ్లిద్దరి కూతుర్లు కూడా యంగ్ హీరోల సినిమాలతో లాంచింగ్ ను ప్లాన్ చేసుకున్నారు. నాగ శౌర్య హీరోగా వచ్చిన ‘ఒక మనసు’ తో నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందన్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ సినిమాకంటే ముందే నిహారిక ఓ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి రెడీ అయ్యింది. ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిందన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసి ఉండదు. ఇక శివానీ మొదటి సినిమాగా ‘2 స్టేట్స్’ ప్రారంభమైంది. అడివి శేష్ ఇందులో హీరోగా నటించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇక మొదటి సినిమా పూర్తయిన తర్వాత నిహారిక తమిళంలో ఓ సినిమా చేసింది.

ఇప్పుడు శివాని కూడా అంతే..! త్వరలోనే ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’ అనే తమిళ మూవీతో ప్రేక్షకులను ముందుకు రానుంది. ఇలా ఇద్దరు స్టార్ కిడ్స్ కూతుర్లకు ఒకే విధంగా జరిగడం ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే నిహారిక మొదటి సినిమాగా ‘ఒక మనసు’ రిలీజ్ అయ్యింది. కానీ శివాని మూవీ రిలీజ్ కాలేదు. మరోపక్క శివానీకి తమిళంలో వరుస అవకాశాలు లభిస్తున్నాయి.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus