Sowmya Rao: జబర్దస్త్ కొత్త యాంకర్ కు మల్లెమాల ఇస్తున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

బుల్లితెర పై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ కార్యక్రమం గత పది సంవత్సరాల నుంచి అద్భుతమైన రేటింగ్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ఈ కార్యక్రమానికి అనసూయ యాంకర్ గా వ్యవహరించేవారు. అయితే ఆమెకు సినిమా అవకాశాలు రావడంతో తను సినిమాలతో బిజీ కావటం వల్ల పూర్తిగా జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు.

ఈ విధంగా అనసూయ వెళ్ళిపోవడంతో రష్మీ కొంతకాలం పాటు జబర్దస్త్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు రశ్మి స్థానంలో మరొక కొత్త యాంకర్ ను మల్లెమాలవారు జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా తీసుకువచ్చారు. బుల్లితెర సీరియల్స్ లో నటిగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న సౌమ్యరావు చూడ చక్కని అందంతో అందరిని ఆకట్టుకున్నారు.ఈ క్రమంలోనే మల్లెమాలవారు ఈమెను జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా పరిచయం చేశారు. ఇలా జబర్దస్త్ యాంకర్ గా ఈమె కొనసాగుతున్నారని తాజాగా ప్రోమో ద్వారా మల్లెమాలవారు తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఎంతోమంది జబర్దస్త్ కార్యక్రమానికి కొత్తగా వచ్చిన యాంకర్ సౌమ్యరావు ఎవరు ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయాలు గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. ఇక ఈ కార్యక్రమానికి ఈమె యాంకర్ గా వ్యవహరిస్తున్నందుకు మల్లెమాలవారు ఈమెకు ఏ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇస్తున్నారనే విషయం గురించి కూడా చర్చలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం మల్లెమాలవారు యాంకర్ సౌమ్యరావుకు ఒక్కో ఎపిసోడ్ కు 60 వేల రూపాయలు చొప్పున రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈమె మాటతీరు ప్రేక్షకులను సందడి చేసే విధానం బట్టి తన రెమ్యూనరేషన్ మరింత పెంచే ఆలోచనలో మల్లెమాలవారు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈమె ఈటీవీలో ప్రసారమైన శ్రీమంతుడు సీరియల్ ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. అయితే జబర్దస్త్ యాంకర్ గా ప్రేక్షకులను ఎలా సందడి చేస్తారో తెలియాల్సి ఉంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus