Puneeth Rajkumar: పునీత్ మరణం వెనుక అసలు నిజాలు ఇవేనా?

మన దేశంలో కొంతమంది స్టార్ హీరోలకు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల ద్వారా కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో అభిమానులను సొంతం చేసుకున్నారు. జిమ్ చేస్తూ కుప్పకూలిపోవడం వల్ల పునీత్ చనిపోయాడంటూ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ఆ వార్తల గురించి నటుడు శ్రీకాంత్ స్పందిస్తూ స్పష్టతనిచ్చారు. పునీత్ గత సినిమా జేమ్స్ లో టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ విలన్ రోల్ లో నటిస్తున్నారు.

జేమ్స్ సినిమా కోసం హెవీ వర్కౌట్లు చేసే క్రమంలో పునీత్ చనిపోయారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని పునీత్ రాజ్ కుమార్ చనిపోవడానికి ముందురోజు నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్నాడని శ్రీకాంత్ తెలిపారు. ఉదయం లేచిన తర్వాత అన్ ఈజీగా అనిపిస్తే పునీత్ ఫ్యామిలీ డాక్టర్ ను కలిశాడని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. డాక్టర్ పరీక్షలు చేయగా ఈసీజీలో చిన్న తేడా కనిపించిందని డాక్టర్ విక్రమ్ హాస్పిటల్ కు షిఫ్ట్ చేయాలని సూచించగా అదే సమయంలో పునీత్ కు హార్ట్ ఎటాక్ వచ్చిందని శ్రీకాంత్ పేర్కొన్నారు.

దురదృష్టవశాత్తూ పునీత్ ను కాపాడుకోలేకపోయామని శ్రీకాంత్ వెల్లడించారు. బయట తినవద్దని చెబుతూ తన ఇంటినుంచి పునీత్ భోజనం తెప్పించేవారని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. పునీత్ చనిపోయాడనే విషయాన్ని నమ్మలేకపోతున్నానని శ్రీకాంత్ కామెంట్లు చేశారు. పునీత్ రాజ్ కుమార్ మరణానికి వేర్వేరు కారణాలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus