Savitri: సావిత్రి పిలుపు వెనుక ఉన్న పరమార్ధం అదేనా..?

  • June 6, 2023 / 01:14 AM IST

చిత్తూరు వి. నాగ‌య్య‌కు సినిమా ఇండ‌స్ట్రీలో అజాత శ‌త్రువు అనేవారు. ఆయ‌న ఎన్నో సినిమాల్లో న‌టించినా.. ఏరోజూ రెమ్యున‌రేష‌న్ కోసం లెక్క‌లు వేసుకున్న ప‌రిస్థితి లేదు. ముందు మాట్లాడుకునేవారు. చివ‌రకు నిర్మాత ఎంత ఇస్తే.. అంత‌తోనే స‌రిపుచ్చుకునేవారు. పోనీలే నాయ‌నా.. సినిమా బాగా పోతే.. ఇవ్వు.. లేక‌పోతే .. మీరు మాత్రం ఏం చేస్తారు అని స‌రిపుచ్చుకునేవారు. ఈ ల‌క్ష‌ణ‌మే నాగ‌య్య‌ను అంద‌రికీ చేరువ చేసింది. అదేస‌మ‌యంలో నాగ‌య్య షూటింగ్ స్పాట్‌లో ఖ‌ర్చు లు త‌గ్గించుకునేవారు.

త‌న టిఫెన్‌, భోజ‌నం వంటివి త‌నే తీసుకువెళ్లేవారు. ఆయ‌న‌కు సొంత‌గా పెద్ద కారు ఒక‌టి ఉండేది. త‌ను వ‌స్తున్న దారిలో ఎవ‌రైనా ఆ సినిమాలో న‌టించేవారు ఉన్నారంటే.. ఠంచ‌నుగా వారి ఇళ్ల వ‌ద్ద కారును ఆపి.. వారిని కూడా ఎక్కించుకుని షూటింగుల‌కు వ‌చ్చేవారు. ఇలా .. ఇండస్ట్రీకి నాగ‌య్య చాలా చేరువ అయ్యేవారు. దీంతో అన్న‌గారు ఎన్టీఆర్ నుంచి అక్కినేని వ‌ర‌కు, భానుమ‌తి నుంచి సూర్యాకాంతం వ‌ర‌కు అంద‌రూ నాగ‌య్య‌ను నాన్న‌గారు అని పిలిచేవారు.

అయితే.. అదేస‌మ‌యంలో హీరోయిన్‌గా న‌టించిన (Savitri) సావిత్రి మాత్రం.. నాగ‌య్య‌ను నాన్న‌గారు అని పిలిచేవారు కాదు. అంద‌రికీ నాన్న‌గారేనేమిటి. నేన‌లా పిల‌వ‌ను. మావ‌య్య అనే పిలుస్తాను అని చెప్పి మ‌రీ ఆట‌ప‌ట్టించేవారు. నాగ‌య్య కూడా.. మా కోడ‌లు పిల్ల అని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. జెమినీ గ‌ణేష‌న్‌ను సావిత్రి పెళ్లి చేసుకున్న స‌మ‌యంలో వ‌ద్ద ని చెప్పిన తొలి వ్య‌క్తి నాగ‌య్య‌.

కానీ, ఆమె వివాహం చేసుకున్నాక‌.. మాత్రం ఆ విష‌యాన్ని అక్క‌డితో నాగ‌య్య వ‌దిలేశారు. తరువాత సావిత్రి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోనదో మనందరికి తెలిసిందే..ఆమె చివరి క్షణాల్లో ఆమెకి ఎవరు తోడు లేరంటే అర్ధం చేసుకొండి సావిత్రి ఎన్ని కష్టాలు అనుభవించిందో తెలుస్తోంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus