యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో.. అగ్రనిర్మాత అశ్వినీ దత్ ఓ భారీ సినిమా ప్లాన్ చేశారు.. ప్రముఖ రచయిత సత్యానంద్ కథ, మాటలు, ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ స్క్రీన్‌ప్లే, మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం, వేటూరి పాటలు, ప్రభుదేవా డ్యాన్స్, విన్సెంట్, అజయ్ విన్సెంట్ కెమెరా.. ఇలా భారీ టెక్నీషియన్స్.. అల్లు రామలింగయ్య, అమ్రిష్ పురి, కోట, బ్రహ్మానందం, బాబూ మోహన్, గీత, ప్రసాద్ బాబు, రాధా రవి (రాధిక అన్న) వంటి భారీ తారగాణంతో అత్యంత భారీగా ప్లాన్ చేశారు..
అన్నపూర్ణ స్టూడియోస్‌లోని థర్డ్ ఫ్లోర్‌లో పాటతో షూటింగ్ స్టార్ట్ చేశారు.. సినిమా ప్రారంభోత్సవానికి పాపులర్ క్రికెటర్, బాలయ్య స్నేహితుడు అజహరుద్దీన్, మెగాస్టార్ చిరజీవి, యువసామ్రాట్ నాగార్జున వచ్చారు. నిజాం కాలేజీలో బాలయ్య, అజహరుద్దీన్ క్లాస్ మేట్స్.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కూడా వీరికి క్లాస్ మేట్స్.. అతిరథుల సమక్షంలో అత్యంత హంగామాగా ప్రారంభమైన ఆ సినిమానే ‘అశ్వమేథం’.. నటభూషణ శోభన్ బాబు కీలక పాత్రలో కనిపించారు.
అలాగే బాలయ్యతో తొలిసారి అందాల కథానాయికలు మీనా, నగ్మా జతకట్టారు.. ఇందులో అభిమన్యు ఐపీఎస్ అనే పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో శోభన్ బాబు, కిరీటి అనే పైలెట్ క్యారెక్టర్‌లో బాలయ్య కనిపించారు.. డాక్టర్‌గా మీనా, జర్నలిస్టుగా నగ్మా నటించారు.. ఇళయరాజా అందించిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.. బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్టు కథ కథనాలు రాసుకున్నారు.. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా షూటింగ్ కంప్లీట్ చేసి క్రిస్మస్ కానుకగా 1992 డిసెంబర్ 25న భారీగా విడుదల చేశారు..
ఓపెనింగ్స్ కూడా భారీ స్థాయిలో వచ్చాయి కానీ సినిమా అనుకున్న స్థాయి విజయం మాత్రం సాధించలేకపోయింది.. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరుకి మంచి పేరు వచ్చింది.. దర్శకేంద్రుడు రేంజ్ సినిమా కాదంటూ ఇండస్ట్రీ వర్గాల వారు తేల్చేశారు.. ఇవీ, అజహరుద్దీన్, చిరంజీవి, నాగార్జున ముఖ్య అతిథులుగా విచ్చేసిన బాలయ్య బాబు ‘అశ్వమేథం’ ఓపెనింగ్ తాలూకు విశేషాలు..
బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!
ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?