ఒకప్పుడు మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు కృష్ణ. అంతేకాదు తెలుగు సినీ పరిశ్రమను కొత్త పుంతలు తొక్కించి విజయాలు అందుకునేలా చేశారయన. అందుకే సూపర్ స్టార్ ఇమేజ్ ఆయన సొంతం అయ్యింది. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే కృష్ణ గారు రెండో పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి? రెండో పెళ్లి చేసుకున్న తర్వాత వీరి భార్యల నుండి ఎలాంటి సమస్యలు తలెత్తాయి వంటి విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది.
కృష్ణ గారు మొదట ఆయన మరదలు అయిన ఇందిరా దేవి గారిని 1961లో వివాహం చేసుకున్నారు.వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. కొన్నాళ్ల తర్వాత ‘సాక్షి’ సినిమా ద్వారా విజయ నిర్మలతో కృష్ణ గారికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 1969లో కేవలం నలుగురు సాక్షుల సమక్షంలో… వీరిద్దరూ తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. కృష్ణ గారిని ఆయన ఇద్దరు భార్యలు చాలా సిన్సియర్ గా ప్రేమించారు. అందుకే ఎలాంటి గొడవలు రాలేదట.
విజయ నిర్మల గారిని పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా ఇందిర గారికి ఎలాంటి లోటు రాకుండా కృష్ణ గారు చూసుకున్నారు. రెండవ పెళ్ళైన తర్వాత కూడా ఇందిర గారి ద్వారా కృష్ణ గారు తండ్రి అయ్యారు. తన భర్త పై ఉన్న ప్రేమతో ఆయన ప్రేమను ఇందిర గారు గౌరవించారు. అందుకే ఆయన రెండో పెళ్ళి చేసుకున్న సమయంలో ఆమె గొడవ చేయలేదు. కుటుంబ సభ్యులు కొందరు కృష్ణగారిని తప్పుబట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా..
‘ఆయన ఏం తప్పు చేయలేదని ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు కనుక ఆయన్ను ఎవరూ ఏమనొద్దంటూ’ కృష్ణ గారికి ఇందిరా మద్దతుగా పలికిన సందర్భాలు ఉన్నాయట. మరో వైపు విజయ నిర్మల గారు కూడా కృష్ణ గారిని పెళ్ళి చేసుకున్నా ఆయన మొదటి ఫ్యామిలీకి ఎటువంటి సమస్యలు రాకుండా.. తనకు మాట రాకుండా జాగ్రత్త పడ్డారు. కృష్ణ గారి కూతుర్లు, కొడుకులతో విజయ నిర్మల చాలా అన్యోన్యంగా ఉండే వారట.