‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్.. కెరీర్ స్టార్టింగ్‌లో ‘కాష్మోరా’ లాంటి హారర్ సినిమాలతో పాటు పలు చిత్రాల్లో సీరియస్ రోల్స్ చేసి.. కామెడీ కింగ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.. ముఖ్యంగా దర్శకులు జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, ఎస్.వి. కృష్ణా రెడ్డి, పెద్ద వంశీ లాంటి దర్శకులు రాజేంద్ర ప్రసాద్‌తో కామెడీ సినిమాలు చేసి.. ఆయనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు.. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ హాస్యభరితమైన చిత్రాలు ఆయనవి..
‘అహ నా పెళ్లంట’, ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘అప్పుల అప్పారావ్’, ‘ఏప్రిల్ 1 విడుదల’ ఇలాంటి ఎన్నో సినిమాలు ఇప్పటికీ ఆకట్టుకుంటుంటాయి.. క్యారెక్టర్ నటుడిగా, హీరోగా, సహాయ పాత్రలు, కీలక పాత్రలతో ఇప్పటికీ ఆడియన్స్‌ని అలరిస్తున్నారాయన.. ‘నటకిరీటీ’ నటించిన ‘బృందావనం’, ‘మాయలోడు’, ‘రాజేంద్రుడు – గజేంద్రుడు’ చిత్రాలకు గల పోలికలకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం..
1. బృందావనం..
రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ జంటగా.. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో.. ఎవర్ గ్రీన్ నిర్మాణ సంస్థ చందమామ విజయా కంబైన్స్ బ్యానర్ మీద బి. వెంకట్రామి రెడ్డి నిర్మించిన చిత్రం ‘బృందావనం’.. కామెడీతో పాటు మాధవపెద్ది సురేష్ స్వరపరిచిన పాటలు బాగా పాపులర్ అయ్యాయి..
2. మాయలోడు..
రాజేంద్ర ప్రసాద్.. ఎస్.వి. కృష్ణా రెడ్డి, నిర్మాత అచ్చి రెడ్డిల క్రేజీ కలయికలో వచ్చిన ‘మాయలోడు’ ఓ ఊపు ఊపింది.. ‘నటకిరీటి’ హీరో, కిషోర్ రాఠీ సమర్పణ, మనీషా ఫిలింస్ బ్యానర్, మిత్ర ద్వయం కృష్ణా రెడ్డి – అచ్చి రెడ్డి అంటే చాలు.. ప్రేక్షకాభిమానులు థియేటర్లకొచ్చేవాళ్లంటే అర్థం చేసుకోండి.. తన సినిమాలకు కృష్ణా రెడ్డే సంగీతమందిస్తారనే విషయం తెలిసిందే.. ఇందులో సాంగ్స్ చాలా బాగుంటాయి..
3. రాజేంద్రుడు – గజేంద్రుడు..
రాజేంద్ర ప్రసాద్.. ఎస్.వి. కృష్ణా రెడ్డి, నిర్మాత అచ్చి రెడ్డి, మనీషా ఫిలింస్ కలిసి చేసిన మరో హిలేరియస్ ఎంటర్‌టైనర్.. ‘రాజేంద్రుడు – గజేంద్రుడు’.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ మూవీలో కృష్ణా రెడ్డి అందించిన పాటలు అదిరిపోతాయి.. ఈ మూడు సినిమాలతో వరుస విజయాలు సాధించారు రాజేంద్ర ప్రసాద్.. ఇక ఈ మూడు చిత్రాలకూ పోలిక ఏంటంటే.. కేవలం సూపర్ హిట్స్ మాత్రమే కాదు.. మూడూ వేటికీ తీసిపోని మ్యూజికల్ సూపర్ హిట్స్.. అదీ విషయం..