Samantha: సమంత సంచలన పోస్ట్ వెనుక అర్థం ఇదేనా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉండటంతో పాటు వరుసగా సినిమాలలో నటిస్తూ ఆ సినిమాలతో పాన్ ఇండియా హీరోయిన్ గా తన ఇమేజ్ ను మరింత పెంచుకోవాలని అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత తాజాగా వెనక్కి తగ్గాను కానీ ఓడిపోలేదు అంటూ ఒక పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సమంత పోస్ట్ లను అర్థం చేసుకోవడం తేలిక కాదని చాలామంది భావిస్తారు.

సమంత తాజాగా చేసిన పోస్ట్ నెటిజన్లకు హాట్ టాపిక్ అవుతోంది. “తోడు లేకుండా నువ్వు బ్రతకలేవు” అనే కొటేషన్ తో ఉన్న టీషర్ట్ ను ధరించిన ఫోటోను సమంత సోషల్ మీడియాలో పంచుకున్నారు. సమంత కొన్ని గంటల క్రితం షేర్ చేసిన ఈ ఫోటోకు 9.5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. 24.2 మిలియన్ ఫాలోవర్లను కలిగి ఉన్న సమంత ఏ పోస్ట్ పెట్టినా ఆ పోస్ట్ కు అంచనాలకు అందని స్థాయిలో రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం.

సమంత తన మనస్సులో ఏదీ దాచుకోకుండా డైరెక్ట్ గా చెప్పేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేసే పోస్ట్ లకు సమంత దూరంగా ఉండాలని కొంతమంది అభిమానులు సూచనలు చేస్తున్నారు. మరోవైపు సమంత ఈ మధ్య కాలంలో మీడియా ముందుకు ఎక్కువగా రావడం లేదు. సమంత గురించి కొన్ని గాసిప్స్ వైరల్ కాగా ఆ గాసిప్స్ లో కూడా నిజం లేదని తెలుస్తోంది.

సమంత త్వరలో వరుస షూటింగ్ లలో పాల్గొనడంతో పాటు తనపై వచ్చిన నెగిటివ్ కామెంట్లకు చెక్ పెట్టనున్నారని సమాచారం అందుతోంది. ఒక్కో ప్రాజెక్ట్ కు 3 కోట్ల రూపాయల రేంజ్ లో సమంత రెమ్యునరేషన్ తీసుకుంటుండగా శాకుంతలం, యశోద సినిమాలు సమంత మార్కెట్ ను డిసైడ్ చేయనున్నాయి. కొన్నిరోజుల గ్యాప్ లో థియేటర్లలో ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus