Ram Charan, Buchi Babu: రాంచరణ్ – బుచ్చిబాబు…ఫోటో వెనుక అసలు కథ..!

Advertisement

ఉప్పెన చిత్రంతో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.80 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రొటీన్ లవ్ స్టొరీ నే అయినప్పటికీ టేకింగ్ కొత్తగా ఉండడం, ముఖ్యంగా క్లైమాక్స్ ను ఎమోషనల్ గా , హృదయానికి హత్తుకునేలా తీర్చిదిద్దిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా అద్భుతంగా ఉండడంతో మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.

అయితే రెండో చిత్రానికి మొదటి చిత్రంతో ఏమాత్రం పోలిక ఉండకూడదు అని బుచ్చిబాబు భావించాడు. ఎన్టీఆర్ కు ఎప్పుడో ఓ కథ వినిపించాడు. అది అతనికి బాగా నచ్చింది. ఈ మూవీలో మాస్ ఎలిమెంట్స్ అలాగే ఎన్టీఆర్ అభిమానులకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఎన్టీఆర్ .. బుచ్చిబాబు కి ఓకె చెప్పి చాలా కాలం అయ్యింది. అయితే ఈ మధ్య ఒక వార్త పెద్ద ఎత్తున హల్ చల్ చేసింది. ఎన్టీఆర్ ..

బుచ్చిబాబు ప్రాజెక్టును పక్కన పెట్టేసి రాంచరణ్ తో ఓ కథ ఓకె చేసుకున్నాడు అని. రాంచరణ్ 16 వ సినిమాకి బుచ్చిబాబు దర్శకుడు అనేది ఆ వార్త సారాంశం. అయితే ఇందులో అస్సలు నిజం లేదు. ఎన్టీఆర్ – బుచ్చిబాబు ల సినిమా తప్పకుండా ఉంటుంది. మరోపక్క సుకుమార్ తో రాంచరణ్ మూవీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి.

సుకుమార్ – చరణ్ మూవీల కథ పై బుచ్చిబాబు కూడా వర్క్ చేస్తున్నాడు.అందులో భాగంగా బుచ్చిబాబు చరణ్ కు కలవడం జరిగింది. ఆ ఫోటో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ – బుచ్చిబాబు సినిమా కాన్సిల్ అయినట్టు కథనాలు పుట్టుకొచ్చాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus