Anchor Ravi Eliminated: రవి ఎలిమినేషన్ వెనక అసలు జరిగింది ఇదేనా..?

బిగ్ బాస్ హౌస్ లో రవి ఎలిమినేట్ అయిపోయినట్లుగా సమాచారం. 12వారాల పాటు తనదైన స్టైల్లో గేమ్ ఆడిన రవి అన్ అఫీషియల్ ఓటింగ్ లో చూస్తే సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. అంతేకాదు, దాదాపు 10శాతం ఓటింగ్ సంపాదించుకుని శ్రీరామ్ తో సరిసమానంగా ఉన్నాడు. నిజానికి ఈవారం ప్రియాంకసింగ్, సిరి, కాజల్ వీరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోతారనే అందరూ భావించారు. ఎక్కడ పోలింగ్ చూసినా వీరి పేర్లే వినిపించాయి. కానీ, అనూహ్యంగా బిగ్ బాస్ హౌస్ నుంచీ రవి ఎలిమినేట్ అయిపోవడం అనేది బిగ్ బాస్ వ్యూవర్స్ ని షాక్ కి గురి చేసింది. ఇక రవి ఫ్యాన్స్ అయితే ఇప్పటివరకూ ఇది నమ్మడం లేదు.

అయితే, అసలు ఏం జరిగింది ? ఎందుకు బిగ్ బాస్ టీమ్ ఇలా చేసింది అని ఆరాలు తీస్తున్నారు అందరూ.బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ లో భాగంగా రవి ఇంకా కాజల్ ఇద్దరే లాస్ట్ కి మిగిలారు. ఇక్కడే సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని వాడి కాజల్ ని సేఫ్ చేసి రవిని ఎలిమినేట్ చేసినట్లుగా చెప్తున్నారు కానీ, సన్నీ కాజల్ కోసం ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని యూజ్ చేయలేదట. మరి రవి ఎలా ఎలిమినేట్ అయ్యాడు. తెర వెనుక జరిగింది ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి బిగ్ బాస్ హౌస్ లో రవి టాప్ 5 వరకూ వెళ్లే కంటెస్టెంట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కానీ, టాప్ 5లో అందరూ మేల్ కంటెస్టెంట్స్ అయిపోతున్నారు. ఫిమేల్ కంటెస్టెంట్స్ అసలు ఉంటారా లేదా అనేది కూడా సందేహంగానే మారింది. అయితే, ఇక్కడే మేల్ కంటెస్టెంట్స్ లో చూసినట్లయితే రవినే లీస్ట్ లో ఉన్నాడు. మరి ఈరకంగా ఏమైనా బిగ్ బాస్ ఫ్రీ హ్యాండ్ తీసుకుని రవిని ఎలిమినేట్ చేసిందా అనేది సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇక రవి ఎలిమినేట్ అయ్యాడు అని తెలియగానే రవి ఫ్యాన్స్ షాక్ తిన్నారు. అన్ని గ్రూప్స్ లో ఇది చాలా అన్ ఫెయిర్ అంటూ , బిగ్ బాస్ షో పబ్లిక్ ఓటింగ్ ప్రకారమే జరుగుతోందా లేదా అని నిలదీస్తున్నారు.

అంతేకాదు, హాట్ స్టార్ లో జరిగే ఓటింగ్ ని పబ్లిక్ కి చూపించాలంటూ డిమాండ్స్ చేస్తున్నారు. ఇది చాలా అన్ ఫెయిర్ డెసీషన్ అని, లాస్ట్ టైమ్ ప్రియ గారి విషయంలో కూడా ఇలాంటి డెసీషన్ బిగ్ బాస్ తీస్కుందని అంటున్నారు. వాళ్లకి ఇష్టమున్నట్లుగా షో నిర్వహించాలి అన్నప్పుడు పబ్లిక్ ఓట్స్ ని పెట్టుకూడదని, పబ్లిక్ ఓటింగ్ కి వాల్యూ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ, బిగ్ బాస్ టీమ్ మాత్రం ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్ అనేది జరుగుతుందని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్ లో రవి జెర్నీ 12వ వారం ముగిసింది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus