బిగ్ బాస్ సీజన్ 7 అనేది ఈసారి ఉల్టా పుల్టా అని చెప్పారు. చెప్పినట్లుగానే ఇది ఉల్టా కాదు కానీ పుల్టాలాగా సాగుతోందని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వచ్చిన పార్టిసిపెంట్స్ గేమ్ ఆడటం రాకపోతే లాస్ట్ వీక్ బిగ్ బాస్ తనని ఇంప్రెస్ చేసే గేమ్ వాళ్లతో తానే స్వయంగా కమాండ్స్ ఇచ్చి ఆడించుకున్నాడు. ఇప్పుడు కూడా సెకండ్ వీక్ లో మాయాస్త్రం సరిగ్గా పంచడం రాకపోతే తానే స్వయంగా పంచే ప్రయత్నం చేసాడు.
అయితే, మొదట్లో బిగ్ బాస్ మాయాస్త్రం భాగాలు ఏ ఇద్దరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటాయో వాళ్లు 4 వారాల ఇమ్యూనిటీ కోసం పోటీ పడి పవర్ అస్త్రాన్ని సాదించిన రెండో ఇంటి సభ్యులు అవుతారు అని క్లియర్ గా చెప్పాడు. కానీ, శివాజీ , షకీల ఇద్దరూ వచ్చేసరికి రూట్ మార్చాడు. ఇప్పుడు మూడో ఇంటి సభ్యుడ్ని కూడా పెట్టుకోవచ్చని చెప్పాడు. దీంతో బిగ్ బాస్ ఏంటీ అన్యాయం అంటూ ఆడియన్స్ ప్రశ్నిస్తున్నారు.
మరి ఇంత అన్యాయంగా రూల్స్ మారుస్తూ ఆడియన్స్ ని బఫూన్స్ ని చేస్తున్నారా అంటూ నిలదీస్తున్నారు. అసలు హౌస్ లో ఎవరిని మీరు కాపాడాలని అనుకుంటున్నారో వారికి డైరెక్ట్ గా ఇమ్యూనిటీ ఇవ్వచ్చు కదా, ఈ డొంక తిరుగుడు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, సందీప్ కి ఈ పవర్ ఇచ్చిన తర్వాత సందీప్ అది తీస్కుని వెళ్లి అమర్ కి ఇచ్చాడు. ఇది ఆడియన్స్ కి చిర్రెత్తుకొస్తోంది.
సందీప్ కావాలనే ఫేవరెటిజం గేమ్ ఆడాడు అని లాస్ట్ టైమ్ కూడా ఇసుకు టాస్క్ లో శివాజీని ఓడించడానికి అమర్ ఇసుక పోశాడు అని, ఇప్పుడు కూడా శివాజీని ఓడించడానికే అమర్ ఇలాంటి నిర్ణయం తీస్కున్నాడని చెప్తున్నారు. హౌస్ లో పాలిటిక్స్ కి బిగ్ బాస్ కూడా వాళ్లకి సపోర్ట్ చేస్తున్నాడని కూడా అంటున్నారు. మరి ఈ బిగ్ బాస్ సీజన్ ఇలాగే కొనసాగితే మాత్రం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరిగేలాగానే కనిపిస్తోంది.
ప్రస్తుతం శివాజీ లాస్ట్ వీక్, ఈ వీక్ పెర్పామన్స్ బాగా ఇచ్చాడు. మాయాస్త్రం టాస్క్ లో కీస్ ని బాగా దాచి అందర్నీ ముప్పతిప్పలు పెట్టాడు. దీంతో గౌతమ్ శివాజీకి సపోర్ట్ చేశాడు. కానీ, సందీప్ ప్రిన్స్ యావార్ ని కాదని అమర్ ని సెలక్ట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదని చెప్తున్నారు. అసలు బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) ఇలా మూడో వ్యక్తిని కంటెండర్ గా చేయడం అనేది అన్యాయమని అంటున్నారు. అదీ మేటర్.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!