Chiranjeevi: చిరు- వెంకీ-దానయ్య ప్రాజెక్టు వెనుక అంత కథ ఉందా?

ఎప్పటికి పూర్తవుతాయో తెలీదు కానీ మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలని లైన్లో పెడుతూ జోరు చూపిస్తున్నారు. స్టార్ హీరోల దగ్గర్నుండీ కుర్ర హీరోల వరకు ఈయన స్పీడ్ చూసి షాక్ కు గురవుతున్నారు.’ఆచార్య’ షూటింగ్ అలా పూర్తయ్యిందో లేదో వెంటనే 3 సినిమాలని సెట్స్ పైకి తీసుకెళ్ళారు. మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’, బాబీ డైరెక్షన్లో ఒక సినిమా… ఇవి సెట్స్ పై ఉండగానే తన 156వ చిత్రాన్ని కూడా అనౌన్స్‌ చేసేసారు చిరు.

‘డివివి ఎంట‌ర్‌టైన్మెంట్స్’ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత డివివి దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఛ‌లో’, ‘భీష్మ’ వంటి వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించి బ్లాక్ బస్టర్లను అందుకున్న వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకుడు.మొదటి రెండు చిత్రాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ను సమపాళ్లలో వడ్డించిన తీరు చిరుకి బాగా నచ్చిందట. అందుకే వెంకీ కుడుముల స్క్రిప్ట్ కు ఓకే చెప్పేసినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా…ముందుగా దానయ్య నిర్మాణంలో సినిమా చేస్తున్నట్టు చిరు అనౌన్స్ చేసినప్పుడు త్రివిక్రమ్ దర్శకుడని ఆయన తెలిపారు.

‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నట్టు చిరు బహిరంగంగానే ప్రకటించారు. కానీ ఇప్పుడు త్రివిక్రమ్.. కాల్ షీట్లు అస్సలు ఖాళీ లేవు. ప్రస్తుతం మహేష్ బాబుతో అతను సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. కానీ అది ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. మరో పక్క పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా పనులు రచయితగా ఉండి చూసుకుంటున్నాడు. ఇక ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో తెరకెక్కే సినిమాలకు సంబంధించి స్క్రిప్ట్ పనులు ఫైనల్ చేసేది కూడా త్రివిక్రమే.

కాబట్టి త్రివిక్రమ్ తో సినిమా ఇక ఎలాగు కష్టమే అని భావించి… వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా చేయడానికి చిరు ఓకే చెప్పారు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే.. వెంకీ కుడుముల కూడా త్రివిక్రమ్ శిష్యుడే కావడం.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus