భారతదేశంలో అత్యధిక పాటలు పాడిన టాప్ సింగర్స్ లో లతా మంగేష్కర్ ఒకరు. ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా భాషలలో 50 వెల పాటలకు పైగా పాడిన ఆమె ఎంతగానో గుర్తింపును అందుకున్నారు. ఇక ఇటీవల ఆ గాన కోకిల తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఇక ఆమె మరణంతో దేశమంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది. ఆమె లోటు తీర్చలేనిది అంటూ అలాంటి సింగర్ కూడా మరొకరు రాలేరు అని చాలామంది ప్రముఖులు బాధాతప్త హృదయాలతో నివాళులు అర్పించారు.
ఇక లతా మంగేష్కర్ కు సంబంధించిన పాటలు అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆమె ఒక్క పాట పాడిన చాలు అని చాలా మంది సినిమా వాళ్ళు ఆమె కోసం ఎదురు చూసేవారు. లతమంగేష్కర్ 30 ఏళ్ళ పాటు చాలా బిజీగా ఉండేవారు. రోజుకు నాలుగైదు పాటలు పాడుతూ వచ్చేవారు. కొన్నిసార్లు 10కి పైగా ఒకేరోజు పాడేవారు. ఆమె తీరిక లేకుండా బిజీగా కనిపించేవారు. లతా పాటలతో కూడా అప్పట్లో పలు సినిమాలకు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వచ్చాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే తెలుగులో మాత్రం ఆమె చాలా తక్కువ పాటలు మాత్రమే పాడారు. అప్పట్లో నిధురపో తమ్ముడా అనే పాట ఎంతగానో గుర్తింపు అందుకుంది. ఇప్పటికి కూడా ఆ పాటను వింటూ ఉంటే ఎంతగానో వినసొంపుగా ఉంటుంది. ఆ తర్వాత మరో రెండు పాటలను పాడిన లతా మంగేష్కర్ బాహుబలి సినిమాలో కూడా ఒక పాటను పాడే అవకాశం వచ్చిందట. బాహుబలి సెకండ్ పార్ట్ లోనే కన్నా నిధురించారా అనే హిందీ వెర్షన్ పాటను లతా మంగేష్కర్ పాదించాలని సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి చాలా ప్రయత్నాలు చేశాడు.
అయితే ఆమె ఆరోగ్యం సహకరించక పోవడంతో పాడలేను అని సున్నితంగా తిరస్కరించారాట. ఆ తర్వాత సాంగ్ విడుదలైన అనంతరం ఆమె మంచి ప్రశంసలు కురిపించారు. హిందీలో మధుశ్రీ అ పాటను పాడారు.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!