సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. కేవలం కాంబో మీద ఉన్న హైప్‌తోనే బిజినెస్ జరుపుకున్న, అత్యధిక ఓపెనింగ్స్ తెచ్చుకున్న, రికార్డులు క్రియేట్ చేసిన చిత్రాలు చాలానే ఉన్నాయి. కొన్ని వర్కౌట్ అయితే.. మరికొన్ని అంతా ఓకే అనుకున్నాక లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్ అయిన సందర్భాలూ ఉన్నాయి. వాటిలో ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు.. సీనియర్ డైరెక్టర్ కె.ఎస్. రవి కుమార్ కలయికలో సినిమా..
రోజా మూవీస్ బ్యానర్..
మహేష్ 1999లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ‘రాజకుమారుడు’ మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. తర్వాత 2000వ సంవత్సరంలో ‘యువరాజు’, ‘వంశీ’ సినిమాలు చేశాడు. ఆ టైంలోనే సీనియర్ నిర్మాత ఎం. అర్జున రాజు.. మహేష్, రవి కుమార్‌ల క్రేజీ కాంబినేషన్ సెట్ చేశారు. రోజా మూవీస్ బ్యానర్ మీద సీనియర్ ఎన్టీఆర్‌తో ‘వేటగాడు’ తో పాటు ఇతర హీరోలతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించి అప్పటికే అగ్ర నిర్మాతగా ఉన్నారు. ఇక డైరెక్టర్ కె.ఎస్. రవి కుమార్.. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్‌తో ‘నరసింహ’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి మాంచి ఫామ్‌లో ఉన్న టైం అది.
నాగార్జునతో ఫ్లాప్.. అయినా రెండో సినిమా..
తమిళనాట బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన రవి కుమార్.. మెగాస్టార్ చిరంజీవి ‘స్నేహంకోసం’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. రెండో సినిమాగా నాగార్జునతో ‘బావనచ్చాడు’ చేశారు. మూవీ ఫ్లాప్ అయింది. ఈ చిత్ర నిర్మాత అర్జున రాజు అదే టైంలో తర్వాత మహేష్ బాబుతో పిక్చర్ చేద్దామని రవి కుమార్‌ని ఫిక్స్ చేసి.. ‘నూతన శతాబ్ది సంక్రాంతి శుభాకాంక్షలతో’ అంటూ మిలీనియం ఇయర్‌లో అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు.
మహేష్ బాబు – కె.ఎస్. రవి కుమార్ బిజీ బిజీ..
చేస్తే.. కొని కథలు అనుకున్నప్పటికీ అవి మహేష్ బాబుకి నచ్చకపోవడం.. ఇంతలో కృష్ణవంశీ ‘మురారి’ కమిట్ అవడం.. రవి కుమార్ కూడా తమిళ్ ప్రాజెక్టులతో బిజీ అవడం వల్ల ఈ సినిమాను పక్కన పెట్టేశారు. 2003లో రాజ శేఖర్ ‘విలన్’ తర్వాత చానాళ్లకు బాలయ్యతో ‘జై సింహా’, ‘రూలర్’ చిత్రాలు చేశారు రవి కుమార్.. కానీ ఈ క్రేజీ కాంబోకి సరైన స్టోరీ సెట్ అయి ఉంటే.. రికార్డులు బద్దలయ్యేవి..