అడివి శేష్ (Adivi Sesh) హీరోగా ‘డెకాయిట్’ (Dacoit) రూపొందుతుంది. షానీల్ డియో ఈ చిత్రానికి దర్శకుడు. ‘అన్నపూర్ణ స్టూడియోస్’ సమర్పణలో సుప్రియ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది క్రేజీ ప్రాజెక్ట్. హీరోయిన్ గా ముందు శృతి హాసన్ ని (Shruti Haasan) తీసుకున్నారు. ఆమె వల్ల ఈ సినిమాకి బజ్ ఏర్పడింది. గ్లింప్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ తర్వాత ఆమె తప్పుకుంది అనే ప్రచారం మొదలైంది. చిత్ర బృందం దీనిపై వెంటనే క్లారిటీ ఇవ్వలేదు.
Dacoit
కానీ ఇటీవల ఓ పోస్టర్ ను విడుదల చేసి అది నిజమే అని కన్ఫర్మ్ చేశారు. అంతా బాగానే ఉంది కానీ.. శృతి హాసన్ ఈ ప్రాజెక్టు నుండి ఎందుకు తప్పుకుంది? అనే ప్రశ్న అందరినీ వెంటాడుతూనే ఉంది. ఆమెకు ఎక్కువ ఆఫర్లు కూడా లేవు. పోనీ వేరే ప్రాజెక్టు కోసం తప్పుకుంది అనుకోడానికి. గ్లింప్స్ కోసం చేసిన షూట్లో తప్ప.. తర్వాత ఆమె ఒక్క షెడ్యూల్లో కూడా పాల్గొనలేదు అనేది ఇన్సైడ్ టాక్. బహుశా ఆమె ఇర్రెగ్యులారిటీ వల్ల తప్పించి ఉండవచ్చు.
సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. శృతి హాసన్ తప్పుకోవడం వల్ల ‘డెకాయిట్’ కి రూ.2 కోట్లు కలిసొచ్చిందట. అదెలా అంటే.. శృతి హాసన్ ‘డెకాయిట్’ కోసం రూ.3 కోట్ల నుండి రూ.3.5 కోట్లు డిమాండ్ చేసిందట. అడ్వాన్స్ రూ.50 లక్షల వరకు ఇచ్చారని సమాచారం. కానీ ఆమె తప్పుకోవడంతో మృణాల్ ని తీసుకున్నారట. ఆమె ‘డెకాయిట్’ కోసం దగ్గరదగ్గర్లో కోటి వరకు మాత్రమే తీసుకుందట. అదీ మేటర్..!