Radhe Shyam: రాధేశ్యామ్ ఫ్లాపైనా భారీ నష్టాలు రాలేదా?

ఈ ఏడాది భారీ అంచనాలతో విడుదలై ఫ్లాప్ గా నిలిచిన సినిమాలలో రాధేశ్యామ్ సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. దాదాపుగా 200 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఫుల్ రన్ లో 100 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడంలో ఫెయిలైంది. ఈ సినిమా నిర్మాతలకు భారీ మొత్తంలో నష్టాలు వచ్చాయని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. ప్రభాస్ సైతం ఈ సినిమా రిజల్ట్ విషయంలో ఫీలయ్యారని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

అయితే రాధేశ్యామ్ మేకర్స్ చేసిన ఒక పని వల్ల ఈ సినిమాకు నష్టాలు తగ్గాయని సమాచారం అందుతోంది. రాధేశ్యామ్ డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి రిలీజ్ కు ముందే అమెజాన్ ప్రైమ్ కు విక్రయించడం ఈ సినిమాకు ప్లస్ అయిందని ఫలితంగా రాధేశ్యామ్ ఫ్లాపైనా భారీ నష్టాలు రాలేదని సమాచారం అందుతోంది. రాధేశ్యామ్ సినిమా ఫ్లాపైనా ఒక వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగానో నచ్చేసింది.

రాధేశ్యామ్ కథను స్టార్ డైరెక్టర్ డీల్ చేసి ఉంటే ఈ సినిమా ఫలితం మరో విధంగా ఉండేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభాస్ గత సినిమాలు ఫ్లాపైనా భవిష్యత్తు సినిమాల ప్లానింగ్ మాత్రం అద్భుతంగా ఉందని ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్లు సాధించడం గ్యారంటీ అని ఇండస్ట్రీలో కూడా వినిపిస్తోంది.

ప్రభాస్ తనపై వ్యక్తమవుతున్న విమర్శలకు సలార్ సినిమాతో ఘాటుగా జవాబిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సలార్ సినిమా 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. కేజీఎఫ్2 తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. సలార్ షూటింగ్ ను వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమాను విడుదల చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!
‘అమెజాన్ ప్రైమ్’ లో అత్యధిక వ్యూస్ ను నమోదు చేసిన తెలుగు సినిమాల లిస్ట్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus