Shani: కావాలనే బిగ్ బాస్ టీమ్ షానీని ఎలిమినేట్ చేసిందా ? అసలు కారణం ఏంటంటే.?

బిగ్ బాస్ హౌస్ లో శనివారం ఎపిసోడ్ లోనే కింగ్ నాగార్జున షానీని ఎలిమినేట్ చేసి పంపించేశాడు. అయితే, ఇక్కడే హౌస్ మేట్స్ నిర్ణయంతో పంపించడం లేదని, ఆడియన్స్ కూడా అదే నిర్ణయాన్ని ఇచ్చారని కంట నీరు తుడిచి మరీ పంపారు. కానీ, షానీ విషయంలో అన్యాయం జరిగిందనే అనిపిస్తోందని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే, మాములుగా బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ అనేది ఎలా చేస్తారు అనేది అందరికీ తెలిసిందే.

గతంలో కూడా హౌస్ మేట్స్ ఓటింగ్ తో ఎలిమినేషన్ అనేది చేయాలని చూశారు కానీ, అది ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు మాత్రం నామినేషన్స్ లో లేకపోయినా కూడా శ్రీసత్య ఇంకా వసంతీ వీళ్లని కూడా షానీతో ఈక్వల్ గానే చూశారు. ఇక్కడే షానీ నామినేషన్స్ లో ఉన్నాడు కాబట్టి ఆడియన్స్ డెసీషన్ అంటూ ఎలిమినేట్ చేయడం కరెక్ట్ కాదని చాలామంది అబిప్రాయపడుతున్నారు. ఈ విషయం అసలు షానీకి అర్దమయ్యిందా లేదా అని కూడా చూడటం లేదు.

నిజానికి షానీ ఈ టాస్క్ లో ఒక ఛాలెంజ్ లో పెర్ఫామ్ చేశాడు. ఆ ఛాలెంజ్ కూడా ఆడని వాళ్లు హౌస్ లో చాలామంది ఉన్నారు. అంతేకాదు, తప్పుగా గేమ్ ఆడినా కూడా కెప్టెన్ అయిపోయాడు రాజ్. దీనిపైన ఎలాంటి కంప్లైంట్స్ లేవు. శ్రద్ధగా గేమ్ ఆడిన షానీని ఎలా పంపించేస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. నిజంగానే షానికి అన్యాయం జరిగిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లేదు కాబట్టి రెండో వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. కానీ, ఎలిమినేషన్ చేసే పద్దతి ఇది కాదనేది చాలామంది వాదన. నిజానికి షానీ ఆ ప్లేస్ లో రాకుండా వేరే వాళ్లు వచ్చుంటే ఏంటి పరిస్థితి అనేది పాయింట్. షానీ కాబట్టి ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్నాడు కాబట్టి చేశారు. అదే వేరేవాళ్లు వచ్చుంటే ఈరకమైన ఎలిమినేషన్ చేసేవారు కాదు కదా అంటున్నారు.

షానీ ఎలిమినేషన్ తర్వాత స్టేజ్ పైకి పిలిచిన నాగార్జున కనీసం తన జెర్నీని కూడా చూపించే టైమ్ ఇవ్వలేకపోయారు అనేది కూడా అంటున్నారు. గత సీజన్స్ లో మొదటి వారం ఎలిమినేట్ అయినవారికి కూడా వారి జెర్నీని చూపించేవారు. కానీ షానీకి మాత్రం టాటా బైబై చెప్పేశారు. ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి బిగ్ బాస్ ఈ సీజన్ లో మొదటి ఎలిమిషన్ ఇలా చేస్తే ఇక ముందు ముందు ఎలాంటి ట్విస్ట్ లు ఇస్తాడో చూడాలి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus